రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
సరదాగా నా గాలి పాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా
గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటే గా
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
అమ్మల్లే నను పెంచింది ఈ పల్లె సీమ
నానల్లే నడిపించింది ఊరంతా ప్రేమ
అమ్మల్లే నను పెంచింది ఈ పల్లె సీమ
నానల్లే నడిపించింది ఊరంతా ప్రేమ
ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా
ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం
అన్ని సొంత ఇల్లే అంత అయినవాళ్లే
ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం
బ్రతుకంతా ఇది తీరే రుణమా
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ
ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ
ప్రసన్నఆంజనేయం అదే నామధేయం
ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
నా వెంటే నువ్వుంటే భయమా
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
సరదాగా నా గాలి పాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా
గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటే గా
_______________
పాట: రామ రామ (Raama Raama)
చిత్రం: శ్రీ ఆంజనేయం (Sri Anjaneyam)
నటీనటులు: అర్జున్ సర్జా (Arjun Sarja), ఛార్మి (Charmi), నితిన్ (Nithiin)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: మల్లిఖార్జున్ (Mallikharjun)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.