(ఒక నిఖార్సైన ప్రేమకథ – హృదయాన్ని కొంతకాలం నిలిపేస్తుంది)
ప్రసాద్ – పేద కుటుంబానికి చెందిన, హైదరాబాద్‌లో టిఫిన్ సెంటర్ నడిపించే యువకుడు. తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి ఇడ్లీలు వండేవాడు, రోడ్డుపక్కన కాఫీ పెట్టేవాడు. అతనికి జీవితానికి ఒకే కోరిక – తన చిన్న తమ్ముడి హార్ట్ ఆపరేషన్‌కి డబ్బు కట్టడం.
ఒకరోజు అతని టిఫిన్ బండి దగ్గరకి ఒక బంగారు రంగు కార్ ఆగింది. అందులోంచి తెల్ల చీరలో ఓ యువతి – అన్వేష. ఆమె మొహం మామూలుగా లేదు కొంపంగా ఉంది. ఆ కోపంతోనే కాఫీ అడిగింది. ప్రసాద్ ఇచ్చిన కాఫీ తాగిన తరువాత ఆమె కాసేపు నిలబడి, నెమ్మదిగా:
“నీ చేతుల్లో ఏదో అద్భుతం ఉంది… నీ కాఫీని తాగితే, ఇంకొన్నాళ్ళు జీవించాలనిపిస్తుంది.” అంది.
ప్రసాద్ చిరునవ్వుతో తల ఊపాడు. ఆమెకి ఆ రోజు నుండి టిఫిన్ బండి అలవాటు అయింది.
వారాలు గడిచాయి… అన్వేష ప్రతి రోజు వచ్చేది. మాటలు పెరిగాయి. నవ్వులు మారాయి. కొన్ని మౌనాలు ప్రేమను మాట్లాడటం మొదలుపెట్టాయి.
కానీ…. ప్రసాద్ ఆమె ధనవంతురాలు కాబ్బటి , “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పడానికి ఎప్పుడూ సాహసించలేదు.
ఒకరోజు అన్వేష రాలేదు.
రెండు రోజులు… మూడు రోజులు…
నాలుగో రోజు ఆమె తల్లి వచ్చింది.
“నా కూతురు క్యాన్సర్ పేషెంట్. ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌లో ఉంది. గత రెండు నెలలు, ఆమె మీ దగ్గర రోజూ కాఫీ తాగినప్పుడు, జీవితాన్ని మరలా ప్రేమించగలిగింది. ఆమె చివరి కోరిక – మీ చేతితో కాఫీ తాగాలని కోరుకుంది. మీ గురించి ఎప్పుడూ మాట్లాడేది. మీ ప్రేమలో తలదాచుకుంది కానీ చెప్పలేదు.”
ప్రసాద్ గుండె కుంగిపోయింది.
చివరి రోజున, ఆమెకి అందించిన కాఫీలో మిగిలిన ఆ కాంతిని చూసి ఆమె చిరు నవ్వు నవ్వింది.
“నీ ప్రేమ నా ఊపిరిగా మారింది ప్రసాద్… నువ్వు మాట్లాడకపోయినా, నేను వినగలను.” అంది.
అన్వేష చనిపోయింది. కానీ ఆమె పేరు మీద ప్రసాద్ తన టిఫిన్ బండిని “అన్వేష కాఫీ”గా మార్చాడు.
ఇప్పుడు అక్కడకి వచ్చే ప్రతీ కస్టమర్‌కి అతను కాఫీ ఇచ్చే కంటే ముందు… ఒక చిన్న ప్రేమకథ చెబుతాడు.
ఒక ఊపిరి కోసం పోరాటం – అదే నిజమైన ప్రేమ.
మరిన్ని ఇటువంటి స్టోరీస్ కోసం తెలుగు రీడర్స్ స్టోరీస్ ను చూడండి.