మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన…
విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్న..
తారకవి ఎన్ని తళుకులు..చాలవే రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులో చూసి ఎన్ని తనలోని వంపులు
లాగి నన్ను కొడుతున్న ..లాలి పాడినట్టుందే
విసుగు రాదు ఏమన్నా చంటి పాపనా…
మారుమల్లెల వాన మృదువైన నా చెలి పైన…
విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్న…
జెక్కన్న చెక్కిన శిల్పమే ఇక కనపడదే…
ఆ చైత్రము ఈ గ్రీష్మము నిను చూడగా సెలవడిగేనులే..
సృష్టిలో అద్భుతం నువ్వే కదా…కాదనగలరా…
నిముషానికే క్షణాలను ఓహ్ లక్షగా మార్చాయ్ మనరా..
అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో ….ఓ
నీలాంటి అందాన్ని తట్టుకోలేరేమో …
శ్రీ రాముడై శ్రీ కృష్ణుడై మారేంతలా…
ఆయువై నువ్వు ఆశవై ఒక ఘోషవై నువ్వు వినపడవా..
ప్రతి రాత్రి నువ్వు రేపటి ఓ రూపమై చెలీ కనపడవా…
తీయని ఈ హాయిని నేనేమని ఇక అనగలను..
ధన్యోస్మని ఈ జన్మని నీకంకితం …
ముడిపడమన్నారు మనువాడమన్నారు సప్తఋషులంతా…
కొనియాడతున్నారు అష్ట కవులే అంతా …
తారాగణం మనమే అని తెలిసిందిలా …
మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన..
విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్న…
తారకవి ఎన్ని తళుకులు చాలవే రెండు కన్నులు..
మురిసినవి ఎన్ని మెరుపులో చూసి తనలోని ఒంపులు…
లాగి నన్ను కొడుతున్నా …లాలి పాడినట్టుందే…
విసుగు రాదు ఏమన్నా… చంటి పాపనా
_____________________
సినిమా పేరు: సోలో (Solo)
దర్శకత్వం: పరశురామ్ (Parasuram)
నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్ (Vamsikrishna Srinivas)
నటీనటులు: నారా రోహిత్ (Nara Rohith), నిషా అగర్వాల్ (Nisha Aggarwal),
సంగీతం: మణి శర్మ (Mani Sharma)
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.