మట్టిలో తేమ ఉందీ
రేయికో ఎన్నెలుందీ
నమ్మితే రేపు నీదీ
జీవితం సాగనుందీ
వెళ్ళే దారుల్లో ఆకాశం తోడుందీ
హద్దే నీకొద్దూ నీ నవ్వే వీడొద్దూ
మట్టిలో తేమ ఉందీ…
రేయికో వెన్నెలుందీ….
పట్టుదల నీ పడవై
దాటు పదా సాగరం
నేలతల్లి నేర్పెకదా
గుండెల్లోని ఓ నిబ్బరం
నిక్కమున్న బాటలోన
నీ పయనం నీకు జయం
ఊపిరున్న కాలమంత
ప్రేమేగా నీకు వరం
ఆశే లేనట్టీ బ్రతుకుందా చెప్పమ్మా
నీ గుండెల్లోనే బదులుంది చిన్నమ్మ
ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ
మట్టిలో తేమ ఉందీ
రేయికో ఎన్నెలుందీ
నమ్మితే రేపు నీదీ
జీవితం సాగనుందీ
______________________
చిత్రం – జై భీమ్ (JAI BHIM)
సాంగ్ – మట్టిలో తేమ ఉందీ (Mattilo Thema Undhi)
సంగీతం – సీన్ రోల్డాన్ (Sean Roldan)
గాయని – వైకోమ్ విజయలక్ష్మి (Vaikom Vijayalakshmi)
సాహిత్యం – యుగభారతి (Yugabharathi)
నటుడు : సూర్య (Suriya)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.