Urvasi Urvasi song lyrics Premikudu

ఊర్వసి ఊర్వసి (Urvasi Urvasi) సాంగ్ లిరిక్స్ – ప్రేమికుడు (Premikudu)

by Lakshmi Guradasi

ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ ఊర్వశీ
ఊసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫార్మసీ
ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ ఊర్వశీ
ఊసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫార్మసీ

గెలుపుకీ సూత్రమే టేకీటీజీ పాలసీ
నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ

ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ ఊర్వశీ

ఓ చెలీ తెలుసా తెలుసా తెలుగు మాటలు పదివేలు
అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు

గెలుపుకీ సూత్రమే టేకీటీజీ పాలసీ
నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ

చిత్రలహరిలో కరెంటు పోతే టేకీటీజీ పాలసీ
బాగ చదివి ఫెయిలైపోతే టేకిటీజీ పాలసీ
తిండి దండగని నాన్న అంటే టేకీటీజీ పాలసీ
బట్టతలతో తిరుపతి వెళితే టేకిటీజీ పాలసీ

ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ ఊర్వశీ

ఓ చెలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో
తెలుపవే చిలకా చిలకా ప్రేమనాడి ఎక్కడుందో

గెలుపుకీ సూత్రమే టేకీటీజీ పాలసీ
నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ

చూపుతో ప్రేమే పలకదులే కళ్లతో శీలం చెడిపోదే
మాంసమే తినని పిల్లుందా పురుషులలో రాముడు ఉన్నాడా
విప్లవం సాధించకపోతే వనితకు మేలే జరగదులే
రుద్రమకు విగ్రహమే ఉంది సీతకు విగ్రహమే లేదే

ఫోజు కొట్టి పిల్ల పడలేదంటే టేకీటీజీ పాలసీ
పక్కసీటులో అవ్వే ఉంటే టేకిటీజీ పాలసీ
సండే రోజు పండగ వస్తే టేకీటీజీ పాలసీ
నచ్చిన చిన్నది అన్నా అంటే టేకిటీజీ పాలసీ

ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ ఊర్వశీ
ఊసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫార్మసీ

గెలుపుకీ సూత్రమే టేకీటీజీ పాలసీ
నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ

పగలు చూడని కన్నెలకు రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం
స్వేచ్చయే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏం లాభం
ఫిగరుల సందడి లేకుండా క్లాసుకి వెళ్లి ఏం లాభం
ఇరవైలో చెయ్యని అల్లరులు అరవైలో చేస్తే ఏం లాభం

___________________

పాట: ఊర్వసి ఊర్వసి (Urvasi Urvasi)
చిత్రం: ప్రేమికుడు (Premikudu)
నిర్మాత: ఎ ఎం రత్నం (A M Ratnam)
దర్శకుడు: శంకర్ (Shankar)
సంగీతం: ఏ ఆర్ రెహమాన్ (A R Rahman)
సాహిత్యం: రాజశ్రీ (Rajasri)
గాయకులు: A R రెహమాన్ (A R Rahman), సురేష్ పీటర్స్ (Suresh Peters), షాహుల్ హమీద్ (Shahul Hameed)
నటులు : ప్రభుదేవా (Prabhudeva), నగ్మా (Nagma)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like