వినవమ్మా తూరుపు చుక్క సాంగ్ లిరిక్స్ –  శ్రీనివాస కళ్యాణం

by Manasa Kundurthi

వినవమ్మా తూరుపు చుక్క
వినవమ్మా వినవమ్మా తూరుపు చుక్క…
వినవమ్మా తూరుపు చుక్క
వినవమ్మా వినవమ్మా తూరుపు చుక్క…

పెళ్లంటే నూరెళ్ల పంట ఏడెడు తరముల్ని కలిపేటిదంట …
అనుకుంటే అయిపోనీదంట ఈ తంతు స్వర్గలు జరిపేటిదంట…
ఎనెన్ని మనులున్న ఎంతెంత గనులైనా ఈ పెళ్లి పనులంటే నడుమే కట్టలంటు…

వినవమ్మా తూరుపు చుక్క
వినవమ్మా వినవమ్మా తూరుపు చుక్క…
వినవమ్మా తూరుపు చుక్క
వినవమ్మా వినవమ్మా తూరుపు చుక్క…

వడ్ల వారిబొమ్మ వైనాలబొమ్మా..
వడ్లు దంచవమ్మా వయ్యారి గుమ్మా…
నా చేతి రోకళ్ళు నల్ల రోకల్లు…
చెయించవమ్మా చేవరోకల్లు..
వేయించమ్మా వెండి పునులు…

ఏ చోటా పుట్టెనో పసుపమ్మా నీ పాదమారని
పారణై మురిసేనమ్మా..
ఏ చోటా పుట్టెనో కుంకుమా నీ నుదుట
సౌభాగ్య రేఖల్ని దిద్దునమ్మా…
ఏ మన్ను ఇచ్చిందో వరిగింజలిని
నీ తలలా తలంబ్రాలయ్యేనమ్మా…
ఏ పట్టు తెంచిందో దారాలు ఇన్ని
తెరాసలే నీకు కట్టునమ్మా…

ఓహో జనకుడు ఎవరమ్మా జనకుడు ఎవరమ్మా…
తన చిట్టి తల్లి చిరునవ్వు కోసం అన్నీ వదిలి పెట్టి వచ్చేవాడేనమ్మా…

వినవమ్మా తూరుపు చుక్క
వినవమ్మా వినవమ్మా తూరుపు చుక్క…
వినవమ్మా తూరుపు చుక్క
వినవమ్మా వినవమ్మా తూరుపు చుక్క…

కోలో కోలో కొత్త కోలాటమాడవే నీ కొంటె కళ్లతో ఓ భామా…
కోలో కోలో మొగ్గ నీ బుగ్గ సిగ్గుల రంగుల ముగ్గులు చిలుకమ్మా…
కోలో కోలోయమ్మా నీ కాలిమెట్టేలు నీ మెట్టినింటికి మెరుపమ్మా…
కోలో కోలోయమ్మ వెలిగించు దీపమే అత్తారింటిలో చిలకమ్మ…
వెలుగమ్మ జిలుగమ్మ చిలకమ్మా…

ఓహో ఏడేడో చుట్టాలు ఏడేడో పట్టాలు ఓ నీడ పట్టున వాలేనమ్మా…
విడిదిల్లు సందళ్లు పందిళ్లు వాకిల్లు గల్లు గల్లుమంటూ మోగేనమ్మ…
వంశాలు కలిసేటి ఆచారమమ్మా ఓ పూటో ఆర పూటో సరిపోనిదమ్మా…
జీవితమే పండించే ఈ పండగమ్మ వందేళ్ల కాలాలు ఏలాలమ్మా…

రాజు లేవరమ్మా రాజు లేవరమ్మా…
ఇల్లంత చుట్టలు ఊరంత బంధాలు ఉన్నోలే మనసున్న మారాజులమ్మా..

వినవమ్మా తూరుపు చుక్క
వినవమ్మా వినవమ్మా తూరుపు చుక్క…
వినవమ్మా తూరుపు చుక్క
వినవమ్మా వినవమ్మా తూరుపు చుక్క…

పెళ్లంటే నూరెళ్ల పంట ఏడెడు తరముల్ని కలిపేటిదంట …
అనుకుంటే అయిపోనీదంట ఈ తంతు స్వర్గలు జరిపేటిదంట…
ఎనెన్ని మనులున్న ఎంతెంత గనులైనా ఈ పెళ్లి పనులంటే నడుమే కట్టలంటు…

వినవమ్మా తూరుపు చుక్క
వినవమ్మా వినవమ్మా తూరుపు చుక్క…
వినవమ్మా తూరుపు చుక్క
వినవమ్మా వినవమ్మా తూరుపు చుక్క…

మంగళమనీ మంగళమనీ మంగళమనారే…
మంగళమనీ మంగళమనీ మంగళమనారే…
అంగనలే ననుగూడి మంగళమనారే…
జయ మంగళమనారే శుభ మంగళమనారే…

__________________

ఆల్బమ్ : శ్రీనివాస కళ్యాణం (Srinivasa Kalyanam)
నటీనటులు: నితిన్ (Nithiin), రాశి ఖన్నా (Raashi Khanna), నందితా శ్వేత (Nandita Swetha)
సంగీతం: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
లిరిక్స్ – శ్రీమణి (Srimani)
గాయకులు: సునీత (Sunitha)
నిర్మాతలు: దిల్ రాజు( Dil Raju) & శిరీష్ (Shirish)
దర్శకుడు: వేగేశ్న సతీష్ (Vegesna Satish)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.


You may also like