Home » రారా నా అందాగాడా (Ra Ra Na Andagada) సాంగ్ లిరిక్స్ – పుష్ప 2 Folk song 

రారా నా అందాగాడా (Ra Ra Na Andagada) సాంగ్ లిరిక్స్ – పుష్ప 2 Folk song 

by Manasa Kundurthi
4.3K views
Ra Ra Na Andagada song lyrics Pushpa 2 folk song

ఓర రారా నా అందాగాడా…
రాతిరంతా వస్తావని…
నీ రాకకోరకు నేనెదురు చూస్తీ మామ
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా

రాతిరంతా వస్తావని రాకకోరకు చూసినాను
రాక రాక వచ్చినావురో ఓరి మేనమామ
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా

ఒరే రారా నా అందాగాడా…
రాతిరంతా వస్తావని నేను పట్టుచీర కట్టుకుంటి మామ
నువ్వు రాకపోయేసరికి..
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా
రారా నా అందాగాడా.. అందాల వన్నెగాడా

రాతిరంతా వస్తావని పట్టుచీర కట్టుకుంటే
రాతిరి అయినా రాకపోతే..
పట్టుచీర చింపి వేస్తిరో ఓరి మేనమామా..
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా

రాతిరంతా వస్తావని రాకకోరకు చూస్తే
రాక రాక వచ్చినావురో ఓరి మేనమామ
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా
రారా నా అందాగాడా.. అందాల చిన్నగాడా

ఒరే రారా నా అందాగాడా…
రాతిరంతా వస్తావని నేను మల్లెపూలు పెట్టుకుంటి మామ
నువ్వు రాకపోయేసరికి..
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా
రారా నా మొనగాడా.. అందాల వన్నెగాడా

రాతిరంతా వస్తావని మల్లెపూలు పెట్టుకుంటే
రాతిరి అయినా రాకపోతే..
మల్లెపూలు పెరికి వేస్తిరో ఓరి మేనమామా..
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా

రాతిరంతా వస్తావని రాకకోరకు ఎదురున్నానే
రాక రాక వచ్చినావురో ఓరి మేనమామ
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా
రారా నా అందాగాడా.. అందాల వన్నెగాడా

ఒరే రారా నా అందాగాడా…
రాతిరంతా వస్తావని నేను మంచి గంధం పూసుకుంటి మామ
నువ్వు రాకపోయేసరికి..
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా
రారా నా మోనగాడా.. అందాల వన్నెగాడా

రాతిరంతా వస్తావని మంచి గంధం పూసుకుంటే
రాతిరి అయినా రాకపోతే..
మంచి గంధం తుడిసి వేస్తిరో ఓరి మేనమామా..
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా
రారా నా అందాగాడా.. అందాల చిన్నగాడా

రాతిరంతా వస్తావని రాకకోరకు ఎదురున్ననే
రాక రాక వచ్చినావురో ఓరి మేనమామ
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా
రారా నా అందాగాడా.. అందాల వన్నెగాడా

ఒరే రారా నా అందాగాడా…
రాతిరంతా వస్తావని కందిరీగ నడుము కదిలితే ఉందిరా మామ అందం
నువ్వు రాకపోయేసరికి..
రారా నా అందాగాడా.. అందాలాచిన్నవాడా
రారా నా మోనగాడా.. అందాల వన్నెగాడా

రాతిరంతా వస్తావని రాకకోరకు చూసినాను
రాక రాక వచ్చినావురో ఓరి మేనమామ
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా
రారా నా మోనగాడా.. అందాల వన్నెగాడా

రాతిరంతా వస్తావని రాకకోరకు వెళ్ళినాను
రాక రాక వచ్చినావురో ఓరి మేనమామ
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా
రారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా

_______________

పుష్ప 2 రాయలసీమ జానపద పాట
సాంగ్ : రారా నా అందాగాడా (Ra Ra Na Andagada)
గానం : లక్కిరెడ్డి పల్లె లక్ష్మీదేవి (Lakkireddy Palle Lakshmi Devi)
తబలా: లక్ష్మీ రెడ్డి (Lakshmi Reddy)
డప్పు : వెంకటరమణ (Venkataramana)
కోరస్ : ఓబులమ్మ (Obulamma), ఓటు సుబ్బమ్మ (Otu Subbamma)
ఏర్పాట్లు మరియు రికార్డ్: నాగులారపు జయసింహ (Nagularapu Jaya Simha)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.