తెల్ల తెల్ల వరంగా తెల్ల వారు జాముల్ల
మెల్లమెల్లగా వచ్చే వెలుగు వోలె
తొలకరి జల్లుల్లో కురిసిన సినుకోలే
మెరుపొలే మెరిసిన ముత్యమోలే
ఎంత ముద్దుగున్నవే సంధ్య ఎంత ముద్దుగున్నవే

నీ మాటల్తో మాయలు చేయొద్దు పిలగొ
పిసదాన్ని కాదు నే గడుసుదాన్నే
మూసి మూసి నవ్వుల్తో నా కెళ్ళి జూసి
నా ఎనక ఎందుకు తిరుగుతావు
కోతలు కొయ్యకురో నీ మీద కోపము తగ్గదురో
నా వెంట తిరగకురో నా అందాన్ని పొగడొద్దురో
ఎంత ముద్దుగున్నవే సంధ్య ఎంత ముద్దుగున్నవే
ఎంత ముద్దుగున్నవే సంధ్య ఎంత ముద్దుగున్నవే
జాము రాతిరిలో నిండు పున్నమిలా
నల్లమబ్బుల్లో పండువెన్నెల్లా
నింగిలోని తార నెలకొచ్చిందా
నేలపై తామరాలే పూసినట్టుగా

నా మనసు దోచావులే సంధ్య నా ప్రాణమే నువ్వులే

ఆకాశానికే నిచ్చేనా వేసి సుక్కల్ని కోసుకుని వస్తానంటూ
సందమామనే తాడుతో కట్టి నేల మీదకే తెస్తానంటూ

మాటలు చెప్పకురో నీ మీద కోపము తగ్గదురో
నా వెంట తిరగకురో నా అందాన్ని పొగడొద్దురో
ఎంత ముద్దుగున్నవే సంధ్య ఎంత ముద్దుగున్నవే
ఎంత ముద్దుగున్నవే సంధ్య ఎంత ముద్దుగున్నవే
పంచ వన్నెల సిలక పాటోలే
నీ మాటలుంటయ్యే తియ్యంగా
సెలయేళ్ళ పురుగుల్లో వచ్చే నురగోలే
నీ నవ్వు ఉంటుందే తెల్లంగా
ఇంద్రధనుస్సు లోని రంగులన్నీ తెచ్చి
వాకిట్లో ముగ్గులు వేస్తానని
సంద్రంలో ఉప్పంతా వేరుగా చేసి
మంచి నీళ్ళే నీకు తెస్తానని
మాటల్తో కట్టకురో కోటలు నా వెనక తిరగొద్దురో
కోతలు కొయ్యకురో నీ మీద కోపము తగ్గదురో
నువ్వు అలిగితే ఎంత అందమో
నీ బుంగా మూతి ఎంత అందమో
నువ్వు నవ్వితే ఎంత అందమో
నీ సొట్టబుగ్గ ఎంత అందమో
ఎంత ముద్దుగున్నవే సంధ్య ఎంత ముద్దుగున్నవే
నా మనసు దోచావులే సంధ్య నా ప్రాణమే నువ్వులే
నువ్వంటే ఇష్టమేరో నాకు నువ్వంటే ప్రాణమేరో
నీ మీద ప్రేముందిరో నువ్వు లేక నేనెట్లా బతుకుదురో

_____________________
గాయకులు : అంజి పమిడి (Anji Pamidi) & శ్రీనిధి (srinidhi)
లిరిక్స్ & నిర్మాత: దొమ్మాటి సురేష్ (Dommati Suresh)
సంగీతం : అంజి పమిడి (Anji Pamidi)
నటీనటులు: చంద్ర శేఖర్ (Chandra Shekar) & యమునా తారక్ (Yamuna Tharak)
దర్శకుడు: రాజేష్ అకుధారి (rajesh akudhari)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.