Home » కోలు కోలో కోలోయమ్మ (Kolu kolu) సాంగ్ లిరిక్స్ Virata Parvam

కోలు కోలో కోలోయమ్మ (Kolu kolu) సాంగ్ లిరిక్స్ Virata Parvam

by Lakshmi Guradasi
3.1K views
Kolu kolu song lyrics Virata Parvam

కోలు కోలో కోలోయమ్మ కొమ్మా చివరన పూలు పూసే కోలో
పువ్వులాంటి సిన్నదేమో మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే

హే పిల్లగాడి మాటలన్ని గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా
కుర్రవాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట
అల్లరంత నల్లపూసలంటా
వాడి గూర్చి ఆలోచనే వాడిపోని ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే

పాదమేమో వాడిదంట పయనమేమో నాది అంట
వాడి పెదవి తోటి నవ్వుతుంటా
అక్షరాలు వాడివంట అర్థమంత నేను అంట
వాడి గొంతు తోటి పలుకుతుంటా
ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే

——————————

సాంగ్ : కోలు కోలు (Kolu Kolu)
చిత్రం: విరాట పర్వం (Virata Parvam)
లిరిక్స్ : చంద్రబోస్ (Chandrabose)
గాయకులు: దివ్య (Divya), సురేష్ (Suresh)
నటీనటులు: రానా (Rana), సాయి పల్లవి (Sai Pallavi)
సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి (Suresh Bobbili)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.