చిట్టి చిట్టి పులకింత (Chitti Chitti Pulakintha) సాంగ్ లిరిక్స్ Journey 

by Lakshmi Guradasi

చిట్టి చిట్టి పులకింత
చిత్రం గా తనువంతా
చేసావు నాలో గోరంత గిలిగింత
ఉంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింతా
రేపావు ఎదలో కొండంత కవ్వింతా
నీ జతే కలిసేనా యిక
నా ఎదకే కలుగును పరవసమంతా

నువ్వు ఏవో ఏవో వర్ణాలనే నింపావు నా కంటి లో
కళ్ళు తెరిచేలోగా వలపై ఇలా నిండావు నా గుండెలో
మన రేపటి పయనం మహా సుందర స్వప్నం
ఓ వేల్లువల్లె నాలో ప్రేమే పొంగి పోయెనే
తోలి కన్నె సిగ్గు సందెవేళ పున్నమాఎలె
హాయిలే లోకమే హాయిలే

ఆ దైవం అరెరే మా హృదయమే మైనం తో చేసాడులే
ఆ మైనం మగువను చూడంగానే కరిగించి వెసాడులే
ఈ మౌన సరాగం మన ఇరువురి సొంతం
నీ శ్వాస ధ్యాస నన్నే తాకి చుట్టమాయేనే
నీ అందమైన జ్ఞాపకాలు చుట్టూ మూగేలే
మూగేనే మువ్వలై మోగేనే

చిట్టి చిట్టి పులకింత చిత్రం గా తనువంతా
చేసావు నాలో గోరంత గిలిగింత

___________________

పాట పేరు : చిట్టి చిట్టి పులకింత (Chitti Chitti Pulakintha)
సినిమా పేరు: జర్నీ (Journey)
దర్శకుడు: ఎం. శర్వణన్ (M.Sarvanan)
సంగీత దర్శకుడు: సత్య.సి (Sathya.C)
నటీనటులు : శర్వానంద్ (Sharvanand), అనన్య (Ananya), జై (Jai), అంజలి (Anjali)
సాహిత్యం: సాహితీ (Sahithi)
గాయకులు: సత్య (Satya), హరిణి (Harini)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like