చిన్ని చిన్ని వన్నెల వెన్నెల కన్నులు సాంగ్ లిరిక్స్ ఉరుమి

by Lakshmi Guradasi

చిన్ని చిన్ని వన్నెల
వెన్నెల కన్నులు నావే కదా

పువ్వులన్నీ పొందు కోర
వచ్చే సుందరి నేనే కదా

హంసనడకల సొగసే
నా అడుగులలో మెరిసే
చందమామ అందమంతా నాలోనే

చిన్ని చిన్ని వన్నెల
వెన్నెల కన్నులు నావే కదా

పువ్వులన్నీ పొందు కోర
వచ్చే సుందరి నేనే కదా

హంసనడకల సొగసే
నా అడుగులలో మెరిసే
చందమామ అందమంతా నాలోనే

కొసరిన కోరికలన్నీ
విన్నవించెనే కన్నె పరువం
విసిగి నసిగి కసరక కథ వినవయ్యో

సందెవెళ సన్నజాజి మల్లె
మంతానాలాడక చెంత చేరేనే
కస్సుబుస్సులాడక మచ్చిక చేసుకోవయ్యా
చిటపట చూపొద్దు అటూ ఇటూ పోవద్దు
నీకు మాత్రమే నా ముద్దు నీకోసం…

చిన్ని చిన్ని వన్నెల
వెన్నెల కన్నులు నావే కదా

పువ్వులన్నీ పొందు కోర
వచ్చే సుందరి నేనే కదా

హంసనడకల సొగసే
నా అడుగులలో మెరిసే
చందమామ అందమంతా నాలోనే

ధరణికే ఏకవీర
తరుణి మెచ్చిన మగధీర

కత్తి తోటి పువ్వును
కోసేటి సాహసమేలయ్యో..హు

చీరగట్టి సింగరించుకున్నా
చిత్రాంగి సిగ్గంతా అప్పగించానోయ్
రాసలీల మాయాజాతలో రమ్యమేలయ్యో
బిడియం చాల్లెద్దు కథాకళి ఆడెద్దు
నీకు మాత్రమే నా ముద్దు నీకోసం..

చిన్ని చిన్ని వన్నెల
వెన్నెల కన్నులు నావే కదా

పువ్వులన్నీ పొందు కోర
వచ్చే సుందరి నేనే కదా

హంసనడకల సొగసే
నా అడుగులలో…. మెరిసే
చందమామ అందమంతా నాలోనే

__________________________

చిత్రం: ఉరుమి (Urumi)
నటీనటులు: ప్రభుదేవా, నిత్య మీనన్,
దర్శకుడు: సంతోష్ శివన్ (Santhosh Sivan )
నిర్మాతలు: పృథ్వీరాజ్(Prithviraj), సంతోష్ శివన్ (Santhosh Sivan)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like