Home » వేల అక్షరాలు కోటి పుస్తకాలు సాంగ్ లిరిక్స్ రత్నం 

వేల అక్షరాలు కోటి పుస్తకాలు సాంగ్ లిరిక్స్ రత్నం 

by Lakshmi Guradasi
15K views
Vela aksharalu koti pusthakalu song lyrics Rathnam

వేల అక్షరాలు కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వార్ధం లేని రూపం అమ్మే కదా

ఎంత నిండుగా నీడనిచ్చినా
ఎండ తప్పని చెట్టే అమ్మా
కంటి నిండుగా నీరే పొంగినా
రెప్ప మూయని చూపే అమ్మ

తానో స్వర్గం తానో దుర్గం
అనితర సాధ్యం తన మార్గం

వేల అక్షరాలు, కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వార్ధం లేని రూపం అమ్మే కదా

నేరం నీదా కాదా అంటు చూడదు లోకం
గాయం చేసే వేళలో
కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు
నిజమే చెప్పేది ఏ భాషలో

సుడిగాలికి ఉడికిందే
దీపం ఈ దీపం చమురుండగ ఆరిందే
అలసటతో పాపం పాపం

వేల అక్షరాలు కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వార్ధం లేని రూపం అమ్మే కదా

_____________________

పాట పేరు: అమ్మే కదా ( Ammekaadha)
గాయకుడు: మంగ్లీ (Mangli)
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
సినిమా పేరు: రత్నం (Rathnam)
నటీనటులు – విశాల్ (Vishal), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar)
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం – హరి (Hari)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.