ఊరు ఎరయ్యింది ఏరు హోరెత్తింది
ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందడింది
ఊరు ఎరయ్యింది ఏరు హోరెత్తింది
ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందడింది
భేరీలు బురాలు తప్పేట్లు తాళాలు
హోరేతే కోలాహలంతో…
ఈ ఏడు లోకాలు ఏలేటి వాడేరా
ఊరేగి రావయ్యా మా వాడ కివేళ
పెద్దోళ్ళు పేదోళ్లు అయినోళ్లే అవ్వాలా
కానోళ్ళ అనే మాట లేకుండా పోవాలా
తోబుట్టువింటికి సారెట్టుకెళ్లి
సాకెట్టు కొచ్చావా మా గడపకి
మాలక్ష్మి మగాడా ఏమిచ్చి పంపాలా
నీచ్చిందేగా మాకున్నది
కదిలేటి రథచక్ర మేమన్నదంట..
కొడవళ్లు నాగళ్లు చేసేపనంతా
భూదేవి పూజే కదా
ఏ వేదమైన ఎవరి స్వేదమైన
ఆ స్వామి సేవే కదా
కడుపారా ఈ మన్ను కన్నోళ్లే అంత
కులమోచించి కాదంటాదా
ప్రతి ఇంటి పెళ్లంటిది వేడుక
జనమంతా చుట్టాలే కదా…
ఈ ఏడు లోకాలు ఏలేటి వాడేరా
ఊరేగి రావయ్యా మా వాడా కి వేళా
పెద్దోళ్ళు పేదోళ్లు అయినోళ్లే అవ్వాలా
కానోళ్ళ అనే మాట లేకుండా పోవాలా
వజ్రాల వడగళ్ళు సిరిజల్లు కురవాలా
తారంగా వాడే ఈ కేరింతల్లోన
ఈ పంచక పంచకె కంచెలున్నా
జరపాలా ఈ జాతర
వయ్యమటలు దాటి సయ్యాటలియ్యలా
మా చెలిమి చాటించగా
ప్రతి పల్లె ఈ సంబరం సాక్షిగా
మనలాగే ఉండాలనుకోదా
ఈ ఏడు లోకాలు ఏలేటి వాడేరా
ఊరేగి రావయ్యా మా వాడా కివేళా
పెద్దోళ్ళు పేదోళ్లు అయినోళ్లే అవ్వాలా
కానోళ్ళ అనే మాటా లేకుండా పోవాలా
_______________________
పాట పేరు: ఊరు ఎరయ్యింది (Ooru Erayyindi)
చిత్రం: కంచె (Kanche)
తారాగణం: వరుణ్ తేజ్ (Varun Tej), ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal).
సంగీత దర్శకుడు: చిరంతన్ భట్ (Chirrantan Bhatt)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Sitarama Sastry)
గాయకులు: శంకర్ మహదేవన్ (Shankar Mahadevan)
దర్శకుడు: క్రిష్ (Krish)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
