Kammani kalalaku aahwanam song lyrics Priya O Priya

కమ్మని కలలకు ఆహ్వానం సాంగ్ లిరిక్స్ Priya O Priya (1997)

by Lakshmi Guradasi

హూలల హూలల హులల్లా హులలలలా
హూలల హూలల హులల్లా హులలలాల

కమ్మని కలలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం
పలికిన పాటకి నా ప్రాణం
అంకితం అన్నది నా హృదయం

హ్యాపీ న్యూఇయర్ హ్యాపీ న్యూఇయర్

పులకించిన కాలపు ఒడిలో
పురి విప్పినదో స్వరపుష్పం
చిరునవ్వుల వీణలు మీటి
వినిపించినదో నవరాగం

హ్యాపీ న్యూఇయర్ హ్యాపీ న్యూఇయర్

కమ్మని కల్లలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం
హ్యాపీ న్యూఇయర్

ఓ జాబిలీ నా నెచ్చెలీ
విన్నానులే నీవన్న మాట
నా కోసమే వస్తావని
కట్టానులే ఓ కలల కోట
అణువణువు నిన్ను తడిమే
చూపులకి ఎంత మహిమో
అణుక్షణము నిన్ను పిలిచే
పెదవులకి ఎంత సుఖమో

ప్రియా ఓ ప్రియా
ప్రియా ఓ ప్రియా

మనసులో ఉన్నది ఓ మాట
తెలుపనా కమ్మగా ఈ పూట

ప్రియా ఓ ప్రియా

హూలల హూలల హులలా హులలల్లలా
హూలల హూలల హులలా హులలల్లలా

ఓ నేస్తమా ఓ నేస్తమా
చిరు గాలితో చిరు గాలితో
కబురంపినా కబురంపినా నేనాగలేక

ఓ జానేమన్ ఓ జానేమన్
మేడిన్ హేవెన్ మేడిన్ హేవెన్

రాసేయనా రాసేయనా
ఓ ప్రేమ లేక

విరహమనే మంచు తెరలో
చిక్కినదో లేత పరువం
కౌగిలిలో వెచ్చ బడితే
కరుగునులే కన్నె బిడియం

ప్రియా ఓ ప్రియా
ప్రియా ఓ ప్రియా

మనసులో ఉన్నది ఓ మాట
తెలుపనా కమ్మగా ఈ పూట

ప్రియా ఓ ప్రియా

పులకించిన కాలపు ఒడిలో
పురి విప్పినదో స్వరపుష్పం

ప్రియా ఓ ప్రియా
ప్రియా ఓ ప్రియా

_________________________

చిత్రం : ప్రియా ఓ ప్రియా ( Priya O Priya (1997))
సాహిత్యం: భువనచంద్ర(Bhuvanachandra),
సంగీతం: కోటి (Koti),
గాయకులు: SP బాలు (SP Balu), KS చిత్ర (KS Chitra),

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like