Home » కుంభమేళా ఎందుకు, ఎక్కడ జరుపుతారు?

కుంభమేళా ఎందుకు, ఎక్కడ జరుపుతారు?

by Nikitha Kavali
0 comments
Kumbh mela history in telugu

భారత దేశం లో ఎన్నో సంస్కృతులు మనం ఆచరిస్తూ వస్తున్నాం అలా ఆచరించగా వచ్చినదే ఈ మహా ప్రక్రియ కుంభమేళా. కుంభమేళా గ్రహాల సంచారాన్ని బట్టి 6 సంవత్సరాలకు, 12సంవత్సరాలకు అల చేస్తూ ఉంటారు. ఈ కుంభమేళాను ముఖ్యంగా హరిద్వార్, నాసిక్, అలహాబాద్, ప్రయాగ్, ఉజ్జయిని ప్రదేశాలలో నిర్వహిస్తారు. ఇలా ఈ  ప్రదేశాలలోనే ఈ కుంభమేళాను జరపడానికి మన పురాణాలలో ఒక కథ కూడా ఉంది. అవి అన్ని ఇప్పుడు తెలుసుకుందాం రండి.

కుంభమేళా జరపడానికి వెనుక ఉన్న కథ:

మన పురాణ కథనాల ప్రకారం దేవతలు రాక్షసులు అందరు కలిసి చిరంజీవులుగా అవ్వడానికి అమృతం కోసం పాల కడలిని చిలుకుంతుండగా ఒక అమృతం ఉన్న కుండ పాల సముద్రం నుంచి ఉద్బవించింది. ఈ అమృతం కోసం దేవతలు రాక్షసులు మధ్య 12 రోజులు 12 రాత్రులు పోట్లాట జరుగుతుంది (అనగా మానవ కాల గమనం ప్రకారం 12 సంవత్సరాలు). ఈ పోట్లాటలో విష్ణువు అమృత కుండని తీసుకొని అక్కడి నుండి పారిపోగా ఆ కుండలో నుంచి కొన్ని అమృతపు బొట్లు ప్రయాగ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్ లో పడతాయి. అందుకనే కుంభమేళాను పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాంతాలలో నిర్వహిస్తారు.

చరిత్ర :

కుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటి, ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ఉత్సవం ప్రధానంగా హిందువుల మధ్య జరుగుతుంది మరియు ఇది గంగా, యమునా, మరియు సరస్వతి నదుల సంగమ ప్రాంతాలలో జరుగుతుంది. కుంభమేళా యొక్క చరిత్ర సుమారు 850 సంవత్సరాల క్రిందటిదని చెబుతారు, దీనిని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు.

కుంభమేళా గురించి మొదటి ప్రస్తావన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ యొక్క రచనల్లో కనిపిస్తుంది. 629-645 మధ్య ఆయన భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఈ ఉత్సవం గురించి వివరాలు అందించాడు. కుంభమేళా యొక్క ప్రాధాన్యతను గుర్తించి, యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.

కుంభమేళా నిర్వహించే సమయాలు:

మన హిందూ ధర్మాల ప్రకారం కుండా అనగా కుంభం మన గ్రహ శాస్త్రాల ప్రకారం కుంభం అనేది రాశి ఉంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశి లో ప్రవేశించినప్పుడు ఈ కుంభమేళా ను నాసిక్ త్ర్యంబకేశ్వరం లో; సూర్యుడు మేష రాశి లో ప్రవేశించినప్పుడు హరిద్వార్ లో; బృహస్పతి వృషభ రాశి, సూర్యుడు మకర రాశి లో ప్రవేశించినప్పుడు ప్రయాగ్ లో; బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశి లో ప్రవేశించినప్పుడు ఉజ్జయిని లో ఈ కుంభమేళాను నిర్వహిస్తారు.

ఈ కుంభమేళాలను మూడు రకాలుగా విభజించారు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి చేసేది సాధారణ కుంభమేళా, ఆరు సంవత్సరాలకు నిర్వహించేది అర్ధ కుంభమేళా, పన్నెండు సంవత్సరాలకు నిర్వహించేది పూర్ణ కుంభమేళా, పన్నెండు పూర్ణ కుంభమేళాల తర్వాత అనగా 144 సంవత్సరాలకు నిర్వహించేది మహా కుంభమేళా. ఈ మహాకుంభమేళా ను (ప్రయాగ్ రాజ్) అలాహాబాద్ లో నిర్వహిస్తారు.  

కుంభమేళా ఎందుకు చేస్తారు?

కుంభమేళా ను పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ కుంభమేళాను సూర్యుడు, బృహస్పతి, చంద్రుల యొక్క స్థాన్నాన్ని బట్టి నిర్వహిస్తారు. మన పురాణాలలోని కథనం ప్రకారం ఈ కుంభమేళాను నిర్వహించే సమయం లో ఆ అమృతపు చుక్కలు పడిన నదులలో జలం చాల పవిత్రంగా మారుతాయి అని  అందరు నమ్ముతారు. ఎక్కడెక్కడో ఉన్న నాగ సాధువులు, అఘోరాలు ఈ కుంభమేళానికి వస్తారు, మాములు జన సంఖ్యా కూడా ఎక్కువగా వస్తారు. ఈ సమయం లో ఈ నదులలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుంది అని భక్తులు అందరు నమ్ముతారు.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ చరిత్ర ను సందర్శించండి .

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.