పోరాడు నువ్వూ..
నడిచి వెళ్ళే దారిలో..
మనిషి తనమే చల్లిపోరా..
తోటి వాడీ సంబరాన్నే.. పంచుకుంటూ
వీసెడైనా ప్రేమకే
నోచుకోనీ తోటివాన్ని
పురిటిలో పసివాడిమల్లే..
దగ్గరికి నువు తీసుకోరా..
నలుగురి మేలూ కోరిన నాడే
మనిషౌతావూ నీవూ
ఆ సత్యాన్నే గుర్తించాకే
మొదలయ్యేనూ నీలో మార్పూ..
నిన్నటి నువే.. నీకెదురు పడీ..
నువ్వెవరనీ.. అడిగే లాగా..
నీ కథ నువే.. రాయాలి మరి..
ఈ నిమిషమే… తనివి తీరా..
ప్రేమ లేని వాడే..
అసలైన పేదవాడు
ఆ లోటు నీకు ఎపుడూ.. రానివకు..
ప్రేమ స్పర్శ తోనే..
ముగిసేను ప్రశ్నలన్నీ
అది నీకు అనుభవమైతే
పుడతావు మళ్ళీ నువ్వే…
__________________
సాంగ్ : బేబీ (Baby)
గాయకుడు: అల్ఫోన్స్ జోసెఫ్ (Alphons Joseph)
కంపోజర్: NYX లోపెజ్ (NYX Lopez)
లిరిక్స్ : చిత్రన్ (Chitran)
తారాగణం: శివ కుమార్ రామచంద్రవరపు (Shiva Kumar Ramachandravarapu),
రచయిత – ఎడిటర్ – దర్శకుడు: రిషికేశ్వర్ యోగి (Rishikeshwar Yogi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.