Home » “అదే నేను అసలు లేను” సాంగ్ లిరిక్స్ – బచ్చల మల్లి (Bachhala Malli)

“అదే నేను అసలు లేను” సాంగ్ లిరిక్స్ – బచ్చల మల్లి (Bachhala Malli)

by Lakshmi Guradasi
0 comments
Ade Nenu Asalu Lenu song lyrics Bachhala Malli

నిలబడే … నిద్ర పడుతుందని …
మత్తు ఒకటుందానీ… తెలిసే …
తెలియదే… అన్నీ వ్యసనాలనీ…
మించే వ్యసనం పేరే… ప్రేమని…
తాన నీడ నన్నే… తాకుతుంటే…
మనసు మరిగిన మురికి వదిలేన…
అదే నేను… అసలు లేను…
తిరిగి జరిగిన జననమా…

ఎలా నిన్ను… విడిచిపోను…
వెలుగు వెనకన నడవనా…

గడ్డి పువ్వంటి నా కోసం…
గుడి తలుపు తీసావే…
ఓక మలుపు తీసీ…
విధిని రాసి…
దారేదో చూపించావే…
చెరపమాకే…

ఇదేనేమో … మొదటి ప్రేమ…
కలిగె అలజడి సహజమా…
తుదే లేక … కదిలిపోగా…
ఇపుడే మొదలయే పయనమా…
(సంగీతం)

చెలియవే… కలువవే…
బురదకి నువ్వు వారనివే…

తలను నిమిరే…
చెలిమి కొరకే…
తిరిగి చూసాలే…

కలవర కలలు…
నిండిన కనులు…
హాయి నిదురే చూసేనే..

కలతికా పడకు…
ఎందుకు దిగులు…
తోడు నీకవనా…

సహనాలు పెరిగే…
వీలు దొరికే…
నడిపే వేలే నీదిలే…

తెలిసాకే కదిలా…
నిన్ను చదివా…
గొప్ప నాదేం లేదులే …

మొరటుతనమే…
విడిచి పెడతా…
ఉంటే నువ్వే ఇలా…

ఇదేనేమో … మొదటి ప్రేమ…
కలిగె అలజడి సహజమా…
తుదే లేక … కదిలిపోగా…
ఇపుడే మొదలయే పయనమా…

_____________________________________

సాంగ్: అదే నేను అసలు లేను (Ade Nenu Asalu Lenu)
చిత్రం: బచ్చల మల్లి (Bachhala Malli)
గాయకులు: S.P. చరణ్ (S.P. Charan), రమ్య బెహరా (Ramya Behara)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekhar)
దర్శకత్వం: సుబ్బు మంగాదేవి (Subbu Mangadevi)
తారాగణం: అల్లరి నరేష్ (Allari Naresh), అమృత అయ్యర్ (Amritha Aiyer)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.