Home » ఇంకా ఎదో (Inka Edho) సాంగ్ లిరిక్స్, డార్లింగ్ (Darling)

ఇంకా ఎదో (Inka Edho) సాంగ్ లిరిక్స్, డార్లింగ్ (Darling)

by Hari Priya Alluru
3.5K views
Inka Edho song lyrics darling

ఇంకా ఏదో ఇంకా.. ఏదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్లతో బందించకు
యదే చేరాలి ఈరోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేది నీలోనే నువ్వు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు

పద పద రారా పరుగు నా రా గురువా గురువా
ఇక భయపడకుండ బయటకి తేరా చొరవా చొరవా

ఇంకా ఏదో ఇంకా.. ఏదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు

మేఘాల ఓల్లోనే ఎదిగిందని
జబిల్లి చల్లేన జడివానని
ముళ్ల పై మేమిల విచ్చుకున్నమని
నీకు పూరేకులే గుచ్చుకోవేమరి
తీరమే మారినా తీరులో మారున
మారదు ఆ ప్రాణం

పద పద రారా పరుగు నా రా గురువా గురువా
ఇక భయపడకుండ బయటకి తేరా చొరవా చొరవా

ఇంకా ఏదో ఇంకా.. ఏదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు

వెళ్ళెళ్ళు చెప్పేసేయ్ ఏమవ్వదు
లోలోన దాగుంటే ప్రేమవ్వదు
అమృతం పంచడం నేరమే అవదురా
హాయినే పొందడం బారమే అనదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా
ఇప్పుడే ఆ అందం

పద పద రారా పరుగు నా రా గురువా గురువా
ఇక భయపడకుండ బయటకి తేరా చొరవా చొరవా

ఇంకా ఏదో ఇంకా.. ఏదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్లతో బందించకు
యదే చేరాలి ఈరోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేది నీలోనే నువ్వు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు

_______________________

పాట పేరు – ఇంకా ఎదో (Inka Edho)
సినిమా – డార్లింగ్ (Darling)
గాయకులు – సూరజ్(Suraj) & ప్రశాంతిని (Prashanthini)
సంగీతం – జి.వి. ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar)
సాహిత్యం – అనంత శ్రీరామ్ (Anantha Sriram)
దర్శకుడు – ఎ. కరుణాకరన్ (A. Karunakaran)
నటీనటులు – ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal)
నిర్మాత – బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ (B. V. S. N. Prasad)

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.