శివ శివ మూర్తివి గణ నాధా
శివ శివ మూర్తివి గణ నాధా
శివుని కుమారుడవు గణ నాధా
శివుని కుమారుడవు గన నాధా
చల్. సిరి కి హరి కి మనువంట
సిరి కి హరి కి మనువంట
హోయి. భలారే అనరా జనమంతా
భలారే అనరా జనమంతా
హొయ్ ఘల్లు మంటు గజ్జ కట్టి చిందు కొట్టే జగమంతా.
అదిరే అదిరే కన్నె అదిరే
అదిరే అదిరే కన్నె అదిరే
కుదిరే కుదిరే అన్నీ కుదిరే
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
మొదటి సారిగా ఎదురయ్యిందిగా వయసు వేడుకా ఓ .. ఓ
అదిరే అదిరే కన్నె అదిరే.
కుదిరే కుదిరే అన్నీ కుదిరే
మ్.హ్మ్…
హే ఎమ్ మాయ మేలికో కలికి ఒంటి కులుకో
నెమలి పింఛమే నాట్యమాడగా ఊపిరాడదనుకో…
ఎం నిప్పు కానికో అదేం కంటి కారుకో
వగల వాడలో నెగడు వేస్తే నా సొగసు కోడెదనుకో
హే వరసై పిలిచే అందాలు
అరె వనమై చిలికే గంధాలు
ఆహా మనసే గెలిచే పంతాలు
అరె మనువై కలిపే బంధాలు
రాజము చేరగా రమణి కోరిక
అదుపు దాటగా.ఓ.ఓ.
అదిరే అదిరే కన్నె అదిరే
ఓ .. కుదిరే కుదిరే అన్నీ కుదిరే
పన్నీటి చినుకో పసిడి పంట జిలుగో…
కాళీ మెట్టే గా తాళిబొట్టుగా జంట చేరిందిగో
మందార తునకో పదం లేని తెలుగో.
మొలక నవ్వుగా మూగ మువ్వగా గుండె తాకేనిదిగో
హే ఎదురై రాణి మేనాలు
చెవిలో పాడని మేళాలు
అరె అటుపై జరిగే వైనాలు
వినకూడదుగా లోకాలు
మదన గీతిక మదిని మీటగా ఎదురులేదుకా…హయ్యయ్యో
అదిరే అదిరే కన్నె అదిరే.
హే కుదిరే కుదిరే అన్నీ కుదిరే.హోయ్.
________________________
గానం: జెస్సీ గిఫ్ట్ (Jessie Gift), కల్పన (Kalpana)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Siri vennela Seetarama Sastry)
ఆల్బమ్: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (Nuvvostanante Nenoddantana)
ట్యాగ్: తెలుగు
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.