Home » నీతో చెప్పనా (Neetho Cheppana) సాంగ్ లిరిక్స్ – Athadu

నీతో చెప్పనా (Neetho Cheppana) సాంగ్ లిరిక్స్ – Athadu

by Lakshmi Guradasi
1.3K views
Neetho Cheppana song lyrics Athadu

నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే
అంత సరదా తెలుసునా

గారం చేసిన నయగారం చూపిన
కనికారమే కలుగుతోందే
కష్టపడకే కాంచన

నేనే నేనుగా లేనే లేనుగా ఆ ఆ ఆ ఆ
నా కన్నుల నిధే వెన్నెల ఓ ఓ ఓ

నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే
అంత సరదా తెలుసునా

ఇంకొంచం అనుకున్న ఇకచాల్లే అన్నానా
వదలమంటే ఏమిటర్ధం
వదిలి పొమ్మన

పనిమాల పైపైన పడతావేం పసికూన
ముద్దు మీరుతున్న పంతం
హద్దులోనే ఆపనా

మగువ మనసు తెలిసేనా మగజాతికి

మొగలి మొనలు తగిలేనా
లేత సోయగానికి కూత దేనికి

గారం చేసిన నయగారం చూపిన
కనికారమే కలుగుతోందే
కష్టపడకే కాంచన

ఒదిగున్న ఒరలోన
కదిలించకె కుర్రదానా
కత్తి సాముతో ప్రమాదం పట్టు జారేనా

పెదవోపని పదునైన పరవాలేదనుకోనా
కొత్త ప్రేమలో వినోదం
నీకు నేను నేర్పన

సొంత సొగసు బరువేన సుకుమారికి

అంత బిరుసు పరువేన
రాకుమారుడాన్టి నీ రాజసానికి

గారం చేసిన నయగారం చూపిన
కనికారమే కలుగుతోందే
కష్టపడకే కాంచన

నేనే నేనుగా లేనే లేనుగా ఆహ్ ఆహ్ ఆహ్ ఆహ్
నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ

__________________________

పాట: నీతో చెప్పనా (Neetho Cheppana)
చిత్రం: అతడు (Athadu)
తారాగణం: మహేష్ బాబు (Mahesh Babu), త్రిష కృష్ణన్ (Trisha Krishnan)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: K.S. చిత్ర (K.S. Chitra), S.P. బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramanyam)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.