శంకర శివ శంకర
నా బాధ వినవేరా
శంకర శివ శంకర
నా దిక్కు నీవేరా
ముప్పుటలా ఈ తిప్పలన్నీ
ఓ ముక్కంటి ఏందయ్యా
గుచ్చుతున్నా ఈ గందాలన్నీ
నీ త్రిశూలమయ్యే
ఓ జంగమయ్యా
శంకర శివ శంకర
నా బాధ వినవేరా
శంకర శివ శంకర
నా దిక్కు నీవేరా
శంభో శివ శంకర బోలో
శంభో శివ శంకర బోలో
బసవన్నై నిన్నే మోస్తా
నాకోసం దిగిరావయ్యా
జయ జయ జయ శంకర బోలో
జయ జయ జయ శంకర బోలో
నా మెడలో కట్ల పాముని
ఎట్లా ఇడిపిస్తావయ్యా
ఆ కొండల బిడ్డను బూని
నీ గుండె రాయయ్యిందా
అంతా నీ బిడ్డలమయ్యా
దయ నీకు మాపై రాదా
ఓ చెంబేడు నీళ్లను పోస్తే
నిలువెల్లా కరిగేవయ్యా
రక్తంతో అభిషేకించా
సరిపోదా ఓ సాంబయ్య
ఒళ్ళంతా విభూది నీకిష్టమయ్యా
నిప్పుల్లో నే ఈడి నీకిస్తానయ్యా
కాలేటి కాష్టం నీకు ఇల్లంటా
నే కాళు మోపా ఆదుకొమ్మంటా
ఈ మంటనే గుడి గంట చేస్తున్నా
శంకర శివ శంకర
నా బాధ వినవేరా
శంకర శివ శంకర
నా దిక్కు నీవేరా
నీ నెత్తి పై
గంగ కారే నా కండ్లల్లో
నువ్ దాసిన ఇషము
నిండే నా బతుకులో
బిచ్చమెత్తేవని తెలిసి ఉన్నా
నీ ముందు నిలిసి జోలే పట్టినా
నా తండ్రివై దారి చూపయ్యా…
శంకర శివ శంకర
నా బాధ వినవేరా
శంకర శివ శంకర
నా దిక్కు నీవేరా
____________________________________
పాట: శంకర (shankara)
చిత్రం: పొట్టెల్ ( Pottel)
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర (Shekar Chandra)
లిరిసిస్ట్: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
గాయకుడు: శాండిల్య పిసాపాటి (Sandilya Pisapati)
రచయిత-దర్శకుడు: సాహిత్ మోత్ఖూరి (Sahit Mothkhuri)
నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి (Nishank Reddy Kudithi), సురేష్ కుమార్ సడిగె (Suresh Kumar Sadige)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రెడ్ర్లు లిరిక్స్ ను చూడండి.