ఒక రోజు తాబేలూ పక్షీ మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాబేలు పక్షిని నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది. ಆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపింది. పక్షి కర్రు పుల్లలతో చేసి ఉంది అదా అంది తాబేలు అవును అదే. నేనే కష్టపడి కట్టుకున్నాను అంది పక్షి సంతోషంగా దానికన్నా నా డొప్పే చూడ్డానికి బాగుందే అంది తాబేలు పక్షి ఏమి మాట్లాడలేదు ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ గూటిని తాకుతాయనుకుంటానూ అందులో ఎలా ఉంటావో ఏమో నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్కా నా డొప్పు లోపలికి వెళ్లిపోతాను. అప్పుడు నాకే ఇబ్బందీ. ఉండదు అంది గొప్పలు పోతూ దానికి పక్షి ఇది నేను సొంతంగా నిర్మించుకున్నా గూడు అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే నీ డప్పు లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు కానీ నా ఇంట్లో నేను నా భార్యా పిల్లలూ అందరం కలిసుండగలం అందుకే నాకు మా ఇల్లే ఇష్టం అంటూ అక్కడినుండి ఎగిరిపోయింది పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచీ ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడం గొప్పలు పోవడం లాంటివి చేయలేదు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.