Home » గుర్రం కోరిక – కథ

గుర్రం కోరిక – కథ

by Haseena SK
0 comments

ఒక రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం నివసించే కొట్టం పక్కనే ఉన్న చెట్టు మీదకు ఒక పావురం వచ్చి వాలింది. పావురం చాలా సేపు దిగులుగా కూర్చోవడం చూసి గుర్రం దాన్ని పలకరించింది. ఏమైంది మిత్రమా ఎందుకు చాలా విచారంగా ఉన్నావు అని అడిగింది గుర్రం ఏం చెప్పమంటావు నా కష్టాలు అన్ని ఇన్నీకావు ఎంతో శ్రమతో ఒక చెట్టు మీద గూడ అల్లుకున్నాను. ఒక పెద్ద గాలివాన వచ్చి ఆ గూడు కాస్త పడిపోయింది. అంటూ ఎంతో భాదగా చెప్పింది పాపురం భాదపడకు నా కొట్టంలో ఎంతో జాగా ఉంది. నువ్వు అందులో గూడు కట్టుకో ఎంత పెద్ద గాలివాన వచ్చినా భయంలేదు. అంది గుర్రం పాపురం గుర్రం కొట్టంలోనే ఓ మూల గూడు కట్టుకోసాగింది. కర్రపుల్లల కోసం పావురం అటు ఇటు బుర్రు బుర్రుమని ఎగిరేది పావురం ఎగరటం చూశాక గుర్రానికి తనకు కూడా రెక్కలుంటే ఎంత బాగుండునో అనే కోరిక కలిగింది రానురాను గుర్రానికి తీరని కోరికగా మారింది. గుర్రం విచారంగా ఉండటం పసికట్టింది పావురం ఎప్పుడూ ఎదో ఆలోచిస్తూ కనబడుతున్నాయి.

ఆరోగ్యం బాగోలేదా అని అడిగింది పావురం నువ్వెంతో అదృష్టవంతురాలివి దేవుడు నీకు రెక్కులిచ్చాడు ఎంతో ఆనందంగా స్వేచ్చగా గాలిలో ఎగురుతూ ఉంటావు నాకు కూడా రెక్కులు కావాలి అనిపిస్తుంది. అంటూ తన భాదను పాపురం తో వెల్లబోసుకుంది గుర్రం. గుర్రం మాటాలు విని పాపురం చిన్నగా నవ్వింది. మిత్రమా ప్రతి రోజూ నేను నిన్ను చూసి నవ్వు ఎంత అదృష్ట రాలి వని అనుకుంటూ ఉంటాను నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీరు అందిస్తున్నాడు. ఇల్లు కట్టుకునే బాధ కూడా నీకు లేదు యాజమాని సంరక్షణలో నువ్వు ఏ చీకూ చింత లేకుండా ఉంటున్నావు నన్ను చూడు నాకు ప్రతిదీ భయమే ఆకాశంలో ఎగరాలంటే గ్రద్దల భయం గ్రుడ్లు పెడితే అవి పొదిగే లోపే పాములు తినేస్తాయేమోనన్ను భయం అంది పావురం. పావురం మాటలు విన్నాక గుర్రానికి ప్రతివారూ ఎదుటి వారు అదృష్టవంతులు తను దురదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటారు. అన్న సత్యం భోద పడిందిಆ రోజు నుండి గుర్రం రెక్కులు లేవన్ను బాధను వదిలేసి ఆనందంగా ఉండసాగింది.

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment