Home » ఐ హేట్ యు మై డాడీ (I Hate u My Daddy) సాంగ్ లిరిక్స్ – Mechanic Rocky

ఐ హేట్ యు మై డాడీ (I Hate u My Daddy) సాంగ్ లిరిక్స్ – Mechanic Rocky

by Lakshmi Guradasi
0 comments
I Hate u My Daddy song lyrics Mechanic Rocky

ఐ హేట్ యు మై డాడీ
నీ మీదే నా చాడీ
నువ్వు చెప్పిన ఆటాడి
గెలవాల నే ఓడి

కూసిందా కోడి మొదలైతది నీ దాడి
నీ తిట్లకు అల్లాడి షివర్ అయితది నా బాడీ

పొద్దునే నిద్దర లేపి బూతులు తిడతాడే
పదిమందిని మధ్యలో పెట్టి ఇజాత్ తీస్తాడే

సాఫ్ట్ గా కనపడే విలన్ ఇతడే
సైకో లా వేదిస్తాడే
కొంపకు పట్టిన సైతాన్ నేనని
గడికొక చురకని అంటిస్తాడే

ఐ హేట్ యు మై డాడీ
నీ మీదే నా చాడీ
నువ్వు చెప్పిన ఆటాడి
గెలవాల నే ఓడి

ఎవడో గొట్టం గాడితో కంపేర్ చేస్తాడే
నాలా నేనుంటానంటే పడేసి నన్నే తంతాడే
అది చెయ్యి ఇది చెయ్యొద్దని ఆర్డర్ లేస్తాడే
చెప్పిందే చెయ్యకపోతే బెల్టు తీస్తాడే

తోలు వలిచేస్తాడే ఎప్పుడైనా కాలిస్తే సిగేరేట్లే
తాట తీసేస్తాడే దోస్తులతో పబ్ ఎడితే ధావత్లే

వదిలేయ్ వదిలేయ్ నన్నింకా వదిలేయ్
కాదిక నా వల్లే
మరు జన్మే ఉంటే కలలో కూడా దొరకను నీకసలే

ఐ హేట్ యు మై డాడీ
నీ మీదే నా చాడీ
నువ్వు చెప్పిన ఆటాడి
గెలవాల నే ఓడి

కూసిందా కోడి మొదలైతది నీ దాడి
నీ తిట్లకు అల్లాడి షివర్ అయితది నా బాడీ
ఓయ్..

_________________________________

పాట పేరు: ఐ హేట్ యు మై డాడీ (I Hate u My Daddy)
చిత్రం: మెకానిక్ రాకీ (Mechanic Rocky)
సాహిత్యం: సనారే (Sanare)
సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్ (Jakes Bejoy)
గాయకుడు: రామ్ మిరియాల్లా (Ram Miriyala)
తారాగణం: విశ్వక్సేన్ (Vishwaksen), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary),
నిర్మాత: రజనీ తాళ్లూరి (Rajani Talluri)
రచయిత-దర్శకుడు: రవితేజ ముళ్లపూడి (Ravi Teja Mullapudi)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.