వెంకటయ్య ధనికుడేగాని పరమలోభి. అతను భార్య పోరు పడలేక తీర్థ యాత్రాలను బయలుదేరుతూ ఇంటి భాధ్యత కొడుకు మీద పెట్టి వెళ్ళాడు. ఆ ఇంటికి బావి లేదు ఊరు బావి నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. కొడుకు శీనయ్య బావి తవ్వించుకుందామని ఎన్నిసార్లు చెప్పినా చూతాం లే అని వెంకటయ్య వాయిదా వేస్తూ వచ్చాడు, డబ్బు ఖర్చు ఇష్టంలేక.
తండ్రి గట్టిగా వద్దనలేదు గనకు శనయ్య తమ పెరట్లో బావి తవ్వించసాగడు. రెండడు గుల లోతును ఇనప్పెట్టె దొరికింది. దాని నిండా డబ్బూ, బంగారు నగలూ ఉన్నాయి. అవి వీ బాపతో శనయ్యకు అర్థం కాలేదు.
“బాబూ, అవి మీ పూర్వికులని అయి ఉంటు యి. ధర్మాత్మలు! ఆ డబ్బు మాబోటి పెదవాళ్ళుకు పంచేని పుణ్యం నంపాదించు కొండి,” అన్నారు కూలీలు.
అనుకోకుండా వచ్చిన డబ్బు! శినయ్య ధర్మబుద్ధి గలవాడు. అందుచేత డబ్బూ, బంగారము పెద్దవాళ్ళకు పంచేశారు. వెంకటయ్య తిరిగి వచ్చి బావి చూసి, బావి తవ్విన చోట తాను పాత పెట్టిన ఇనప్పెట్టే ఏమయిందని అడిగాడు. శినయ్య జరిగినదంతా చెప్పాడు. లోభి వాడి ప్రాణం కడబట్టి నట్టుయింది. తాను డబ్బు అక్కడ దాచినమాట అతను తన భార్యకు కూడా చెప్పి ఉండలేదు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.