Home » సందమామ (Sandamaama) సాంగ్ లిరిక్స్ – స్వాగ్ (Swag )

సందమామ (Sandamaama) సాంగ్ లిరిక్స్ – స్వాగ్ (Swag )

by Lakshmi Guradasi
0 comment

ఏపూటకాపూటే సందమామ
పైవాడి ఆటే సందమామ
నువ్వెంత నేనెంత సందమామ
ఆ చేతి గీత దాటగలమా

నీకూ నాకూ నచ్చేటట్టు
అచ్చిరావే అయ్యేవన్ని
నువ్వూ నేనూ పోవద్దన్నా
అగిపోవే పోయేవన్ని

ఏపూటకాపూటే సందమామ
పైవాడి ఆటే సందమామ

ఉన్నదేదో ఉందంటూ సంతోషించాలా
లేనిదేదో ఇక రాదంటూ సంబాళించాలా
తెలిసిరాని చిత్రంగా రోజూ గడపాలా
కలిసిరాని కాలం వెంటే కదిలిపోవాలా

తెలిసింది వేదాంతం… దొరికిందే నా సొంతం…
దీపాన్నార్పే గాలి లాంటిదే దిగులు
చీకటి దాటి వెలుతురు చూడాలి పగలు

మనిషై పుట్టాకా భూమ్మీద పాదం పెట్టాకా
మామూలే నిట్టూర్పులు

ఏపూటకాపూటే సందమామ
పైవాడి ఆటే సందమామ
నువ్వెంత నేనెంత సందమామ
ఆ చేతి గీత దాటగలమా

ఎందుకంత విస్మయం
నాదేన ఈ నిర్ణయం
నచ్చాననే వచ్చిందిలా ఈ జీవితం
నేనందుకుందే అందమైనదంటు
కదలడమే అలవాటు

నాకే నేనిష్టం నేనున్న తీరే నాకిష్టం
ఈ మేను ఓ కానుకే

ఏపూటకాపూటే సందమామ
పైవాడి ఆటే సందమామ
నువ్వెంత నేనెంత సందమామ
ఆ చేతి గీత దాటగలమా

____________________________________________

పాట – సందమామ (Sandamaama)
చిత్రం: స్వాగ్ (Swag )
గాయకుడు– రిత్విక్ ఎస్ చంద్ (Rhithwik S Chand)
సంగీతం – వివేక్ సాగర్ (Vivek Sagar)
గీత రచయిత– రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీతం : వివేక్ సాగర్ ( Vivek Sagar)
గానం : రిత్విక్ ఎస్ చంద్ (Rhithwik S Chand)
నటించినవారు: శ్రీవిష్ణు (Sree Vishnu), రీతూ వర్మ (Ritu Varma), మీరా జాస్మిన్ (Meera Jasmine), దక్ష నాగర్కర్ (Daksha Nagarkar), శరణ్య ప్రదీప్ (Saranya Pradeep), సునీల్ (Sunil), & తదితరులు
నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్ (T.G. Vishwa Prasad)
రచన మరియు దర్శకత్వం: హసిత్ గోలి (Hasith Goli)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి .

You may also like

Leave a Comment