Home » నీలికళ్ళ సిన్నదాన్ని (Neeli Kalla Sinnadhani) సాంగ్ లిరిక్స్ – జానపద పాట (Folk Song)

నీలికళ్ళ సిన్నదాన్ని (Neeli Kalla Sinnadhani) సాంగ్ లిరిక్స్ – జానపద పాట (Folk Song)

by Vinod G
639 views
neeli kalla sinnadhani folk song lyrics

నీలికళ్ళ సిన్నదాన్ని నిమ్మలంగ ఉన్నదాన్ని మేనబావయ్య
నిన్ను చూసి మురిసేదాన్ని నిండ ముంచిపోతివేంది బావో సైదయ్య
నీలికళ్ళ సిన్నదాన్ని నిమ్మలంగ ఉన్నదాన్ని మేనబావయ్య
నిన్ను చూసి మురిసేదాన్ని నిండ ముంచిపోతివేంది బావో సైదయ్య

గావురాల సిన్నదాన్ని మంచి మనసు ఉన్నదాన్ని నీ రాక కోసమే వేచి ఉన్నదాన్ని..
అట్టగాదె పిల్లా
నేను విన బావ
అట్టగాదె పిల్ల అందమైన జానవే జర కోపం ఆపవే
నీకు బంగుళాలు కొందమని బోతినే పర దేశం బోతినే

ముట్టుకుంటే కందిపోతవనీ నిన్ను మేడ మిద్దిలల్లో ఉంచాలనీ
కారు బస్సులల్లో తిప్పాలనీ నిన్ను ఇడిసిబెట్టి పట్నం వచ్చినోడ్ని

నీ మాయమాటలన్ని నేను నమ్మితే ఉన్న బంగారమంతా నేనమ్మితే
నీ మీద పానమెట్టి ఊరు దాటితే నువ్వు ఉన్న సోట ఉంటానని కోరితే
పట్టు సీరలంటివే పట్ట గొలుసులంటివే హైటెక్ మాటలాడి ఫ్లైటెక్కి నువ్వు బోతివే
జర నమ్మరాదే
నిన్ను నమ్మ బావో
జర నమ్మరాదే అందమైన జానవే జర కోపం ఆపవే
నీకు బంగుళాలు కొందమని బోతినే పర దేశం బోతినే

ఉన్న ఏడు ఎకరాలు నీకు రాస్తే ఊళ్ళో లేని పోనీ పేరు నేను మొస్తే
నువ్వు వస్తావని ఉత్తరాలు రాస్తే ఊరు కట్ట కాడ ఎదురుసూపు సూసితే
ఇంత బంగారు బొమ్మనట్లా జేస్తనా ఇంత ముద్దుగున్న దాన్ని మరిసిపోతాన
నువ్వు వద్దన్న పని నెంజేస్తాన ఇంత తెలివిగల్ల దాన్ని ఇడిసిపోతన
ముద్దు ముద్దు బావయ్యో ముద్దాడి పోవయ్యో
మనసుబడ్డ సిన్నదాన్ని మనువాడు బావయ్య

జర ముట్టుకోకు నన్ను పట్టుకోకే
అహ నీలికళ్ళ సిన్నదాన్ని నిమ్మలంగ ఉన్నదాన్ని మేనబావయ్య
నిన్ను చూసి మురిసేదాన్ని గుండెనిండా దాసుకుంట రావో సైదయ్యా

బంగారు బావ ఓసారి రావా వన్నెగల్ల సిన్నదాన్ని బుజ్జగించి హత్తుకోవా
ఓ నీలికళ్ళ పిల్ల నేను బావో
ఓ నీలికళ్ళ సిన్నదాన నీలిరంగు సీరలోన ముద్దూగున్నవే
నీ సొట్టబుగ్గ కాటుకల్లే అట్ట నేను ఉండిపోతా పిల్లో సూడవే

నీలికళ్ళ సిన్నదాన్ని నిమ్మలంగ ఉన్నదాన్ని మేనబావయ్య
నిన్ను చూసి మురిసేదాన్ని గుండెనిండా దాసుకుంట రావో సైదయ్యా


కృష్ణవేణి సాంగ్ లిరిక్స్ – జానపద పాట

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.