Home » కృష్ణవేణి సాంగ్ లిరిక్స్ – జానపద పాట

కృష్ణవేణి సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
962 views
krishnaveni folk song lyrics

సన్నని నవ్వుల పలకరింపుల తోటి మందలించి ఏళ్లకే
పులకరింపుల తోటి ఒక్కతీరు మనసు ఆగం అవుతున్నదే

ఈడుకొచ్చిన పిల్ల తోడు మానుకొని నీ వెంట వస్తున్ననే
వెంట తిప్పుకొని జాడ తప్పుకొని ఆగం చేసేళ్లకు
పంతాలు ఒప్పంద బంధాలు అవ్వంగా
భావాలు దూరంగా ఎట్టుంటాయి

నీ పైన అమితంగా ప్రేమను చూపించే
మానసంతా నీ రూపు నిండుంటాది

ప్రాణంగా గుండెల్లో నిన్ను దాచుకొని
భద్రంగా చూసుకుంటా…
ఆ మాట ఇచ్చావు అది చాలు పదివేలు
జన్మంతా ఇచ్చుకుంటా…
నా జన్మంతా ఇచ్చుకుంటా..

రాయ్యే కృష్ణవేణి
నా నవ్వుల మహారాణి
నీతో ఉండిపోని
నా సిన్ని ప్రాణాన్ని

ఉండిపోతానయ్యో బతుకంతా నీతోని
పంచుకుంటారయ్యో నా సంతోషాలన్నీ

వలచి వచ్చిన వాడ్ని
పిలిచి పిలిచి నువ్వు తొందరచేస్తున్నవే
మరచిపోని తీరు మదిలోన మెదిలేవు
మనసులో కూచ్చున్నవే

గుట్టు విప్పినోడా దాగివున్న మాట బయటకు రానియ్యవు
ఏమిటయ్యె గుట్టు గుండెలోన దాచి నువ్వేమి సాధిస్తావు
తోడు నిలిచినదాన్ని కాస్త కలుపుకొని మనసారా ప్రేమించుకో

నిండు పున్నమి వేళ ఎదపైన నువ్ వాలి
కాస్త సేదతిరి పో
నీ ప్రేమనే పంచి పో

రాయ్యే కృష్ణవేణి
నా నవ్వుల మహారాణి
నీతో ఉండిపోని
నా సిన్ని ప్రాణాన్ని

ఉండిపోతానయ్యో బతుకంతా నీతోని
పంచుకుంటారయ్యో నా సంతోషాలన్నీ

తలచి తలచి నిన్ను ప్రాణంగానే చూస్తూ
నీ తోడు నేనుంటానే
నిన్ను మరచి విడిచి ఏమైనా క్షణమైన
దూరంగా నేనుండానే

గుండె గుణముగళ్ల మనసువున్నవాడు
మా వాడు అయ్యాడని
ఎగిరి గంతులేసి నాలోన నేను సంబరపడిపోతిని
వయసు మనసు వలపులున్నదాన్ని
జర్ర కౌగిట్లో నన్ను చేర్చుకో

తనివి తీరా నువ్వు నన్ను హత్తుకొని
కడదాకా తోడుండిపో
నా బతుకంతా నువ్వు నిండిపో

రాయ్యే కృష్ణవేణి
నా నవ్వుల మహారాణి
నీతో ఉండిపోని
నా సిన్ని ప్రాణాన్ని

ఉండిపోతానయ్యో బతుకంతా నీతోని
పంచుకుంటారయ్యో నా సంతోషాలన్నీ

ప్రాణంగా గుండెల్లో నిన్ను దాచుకొని
భద్రంగా చూసుకుంటా…
ఆ మాట ఇచ్చావు అది చాలు పదివేలు
జన్మంతా ఇచ్చుకుంటా…
నా జన్మంతా ఇచ్చుకుంటా..


పల్లె రాణి సాంగ్ లిరిక్స్ – జానపద పాట

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.