జల జల పారే నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుపై ఒక పక్షి గూడ కట్టుకుని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాయి. ఒకనాడు ఆ పక్షి తన పిల్లలు మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి మూడు పిల్లలు ఒక పిల్ల గూడి నుండి తల బయటకు పెట్టి బయటి ప్రపంచం చూస్తుంది. అంతలో తల్లి వచ్చి
ఆ పిల్లను కొప్పడి ఇంకెప్పుడు బయటకు చూడకూడదు. పోరపాటుకి క్రింద పడవచ్చు లేక మన శత్రువులు హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్ళు వచ్చు మీరు పెద్ద అయిన తరువాత నాలాగే బయటను వెళ్ళువచ్చు.
అని ముద్దుగా మందలించింది. మరునాటి ఉదయం ఆపక్షి మేతకు వెళ్ళింది. అమ్మ మాట లెక్క చేయకుండా ఆ పక్షి పిల్లిలు మరల గూటి అంచు వరకు వచ్చి బయటి వింతలను ఆదమరచి చూస్తుంది. ఆ సమయంలో పెద్దగాలి వీయడంలో పట్టుతప్పి కాలుజారి నదిలో పడి కొట్టుకోనిపోయి ప్రాణాలు వదలింది.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.