Home » సిద్దిపేట పిల్లని సుడు సాంగ్ లిరిక్స్ – Folk Song

సిద్దిపేట పిల్లని సుడు సాంగ్ లిరిక్స్ – Folk Song

by Lakshmi Guradasi
0 comments
Siddipeta Pillani Sudu song lyrics folk

సిద్ధిపేట పిల్లని చూడు
పిల్లని చూడు
పెట్టుకొని కళ్ళజోడు
పెట్టుకొని కళ్ళజోడు

అరెరే సిద్ధిపేట పిల్లని చూడు
పిల్లని చూడు
పెట్టుకొని కళ్ళజోడు

ముద్దు పేరు పల్లి పట్టి
సుభాష్ రోడ్ దోవ పట్టి
చెన్నై మాల్ లా చీర కట్టి
నా చెయ్యి గుంజి పట్టి

వస్తానంది
అరెరే వస్తానంది
అరెరే వస్తానంది మెల్లగా
ఎం చేయాలే పిల్లగా
వస్తానంది మెల్లగా
ఎం చేయాలే పిల్లగా

వాళ్ళ అయ్యా జేబులో పైసలు కోట్టి
నాకేమో ఫోన్ గోట్టి
వాళ్ళ అయ్యా జేబులో పైసలు కోట్టి
నాకేమో ఫోన్ గోట్టి
మా ఇంటి డోర్ కొట్టి
నా గళ్ళ గుంజి పట్టి
ఆన్లైన్ లో టిక్కెట్ కొట్టి
బాలాజీ టాకీస్ దోల్కాబట్టి

వస్తానంది
అరెరే వస్తానంది
అరెరే వస్తానంది మెల్లగా
ఎం చేయాలే పిల్లగా
వస్తానంది మెల్లగా
ఎం చేయాలే పిల్లగా

కాళ్లకేమో కాటుక పెట్టి
కాళ్ళకేమో పట్టిలు పెట్టి

కాళ్లకేమో కాటుక పెట్టి
కాళ్ళకేమో పట్టిలు పెట్టి
బొమ్మల సందిన బొట్టు పెట్టి
చెవులకేమో కమ్మలు ఎట్టి
ముక్కుకేమో ముక్కెర పెట్టి
కమ్మటి చెరువు దువ్వబట్టి

వస్తానంది
అరెరే వస్తానంది
అరెరే వస్తానంది మెల్లగా
ఎం చేయాలే పిల్లగా
వస్తానంది మెల్లగా
ఎం చేయాలే పిల్లగా

జుట్టు అంత గుంజి కట్టి
ఒక పక్కే కొప్పు కట్టి

జుట్టు అంత గుంజి కట్టి
ఒక పక్కే కొప్పు కట్టి
కూరగాయల సంచి పట్టి
గిర్రు చెప్పులు కాళ్ళకు ఎట్టి
మోటార్ సైకిల్ బయటకు నెట్టి
లాల్ కమ్మన్ దువ్వనబట్టి

వస్తానంది
అరెరే వస్తానంది
అరెరే వస్తానంది మెల్లగా
ఎం చేయాలే పిల్లగా
వస్తానంది మెల్లగా
ఎం చేయాలే పిల్లగా

పచ్చ రంగు చీరె కట్టి
జడ నిండా మల్లెలెట్టి

పచ్చ రంగు చీరె కట్టి
జడ నిండా మల్లెలెట్టి
గళ్ళు గళ్ళు గాజులేసి
కొబ్బరికాయ చేతిలో పట్టి
మూడు పాయల ఆటో పట్టి
ఎంకన్న గుడి తొవ్వనబట్టి

వస్తానంది
అరెరే వస్తానంది
అరెరే వస్తానంది మెల్లగా
ఎం చేయాలే పిల్లగా
వస్తానంది మెల్లగా
ఎం చేయాలే పిల్లగా

దాని కళ్లేమో కళ్ళు లోటీ
మూతేమో ముంతల్ మట్టి
దాని చిటికెను ఏలు పట్టి
ఏలుకుంటా తాళి కట్టి

జల్లెడపట్టిన
అరెరే జల్లెడపట్టిన
అరెరే జల్లెడపట్టిన యాడ
దొరకలే దాని జాడ
జల్లెడపట్టిన యాడ
దొరకలే దాని జాడ

జల్లెడపట్టిన యాడ
దొరకలే దాని జాడ
జల్లెడపట్టిన యాడ
దొరకలే దాని జాడ
దొరకలే దాని జాడ
దొరకలే దాని జాడ

________________________________________

పాట: సిద్దిపేట పిల్లని సుడు (Siddipeta Pillani Sudu)
సాహిత్యం: ప్రసాద్ పొట్లచెరువు (Prasad potlacheruvu)
గాయకుడు: దిలీప్ దేవగన్ (Dilip Devagan)
సంగీతం: సత్య దీప్ (Satya Deep)
నటీనటులు : శ్రీదీప్, (Sreyadeep) ప్రసాద్ పొట్లచెరువు (Prasad potlacheruvu)
కొరియోగ్రఫీ – దర్శకత్వం : ప్రసాద్ పొట్లచెరువు (Prasad potlacheruvu)

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.