ఓ వ్యాపార వైత వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. అందులో నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గమూ కన్పించలేదు. అతనికి అప్పులు ఇచ్చిన వాళ్లు బాకీ తీర్చమని వేధించడం మొదలుపెట్టారు. అతనికి వస్తువులు సరఫరా చేసిన వాళ్లు డబ్బులు చెల్లించమని రోజూ ఫోన్లు చేయడం మొద్దల పెట్టారు. ఇలాంటి పరిస్థితులో అతను ఓ రోజు ఉదయం ఇందిరా పార్క్ కి వచ్చి తల పట్టుకు కూర్చున్నాడు. తన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాల అని ఆలోచిస్తూ ఉన్నాడు.
అప్పుడే అతని దగ్గరుకు ఓ వ్యక్తి వచ్చాడు. అతని వయుసు 70 సంవత్సరాలు ఉండవచ్చు. వ్యాపారవైత ఏదో బాధలో వున్నట్టున్నావు? ప్రశ్నించాడు. వ్యాపారవైత తన పరిస్థితిని వివరించాడు. ‘నీకు నేను సహాయం చెయ్యగలను’ చెప్పాడు ఆ వ్యక్తి. వ్యాపారవేత్త పేరు అడిగి తెలుసుకొని పది లక్షలకి చేక్ రాసి అతనికిచ్చి ఇట్లా అన్నాడు. ఈ డబ్బు అవసరమైతే వాడుకో. సరిగ్గా సంవత్సరం తరువాత ఇక్కడే కలుద్దాం. అప్పుడు ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేద్దువు వ్యాపారవేత్త ఆలోచించే లోపే అతను అక్కడి నుంచివెళ్లిపోయాడు. వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు. దేవుడే అతడిని పంపించాడని అనుకున్నాడు.
ఆ వ్యక్తి సంతకాన్ని చూస్తే అతని పేరు సుబ్బరామిరెడ్డి అని ఉంది. ఈ డబ్బుతో నా బాధలో తొలిగిపోతాయని ఆ వ్యాపారవేత్త అనుకున్నాడు. కానీ ఆ చెక్కును అప్పుడే వాడు కోదల్చుకోలేద. తన వ్యాపారాన్ని తిరిగి సమర్థవంతంగా కొనసాగించడం మొదలు పెట్టాడు. అచెక్కు అతనికి కొండంత బలం ఇచ్చింది. అంతగా అవసరమైతే చెక్కును వాడుదామని అనుకున్నాడు. చాలా ఆశావహంగా తన వ్యాపారాన్ని కొనసాగించాడు. తన బాకీదారు లని, డిస్టిబ్యాటర్లకి డబ్బు చెల్లిస్తానన్న నమ్మకం కలిగించాడు. కొన్ని నెలలు గడిచాయి. అతని వ్యాపారం అభివృద్ధి చెందింది.
అప్పుల బాధ నుంచి అతను బయటపడ్డాడు సరిగ్గా సంవత్సరం తరువాత అతను మళ్లీ ఇందిరాపార్కికి వచ్చి ఆ చెక్కు ఇచ్చిన వ్యక్తి కలిసిన ప్రదేశానికి వచ్చాడు. ఆ వ్యక్తి అక్కడ కన్పించాడు. ఆ చెక్కుని అతని చేతిలో పెట్టి తాను ఎలా వ్యాపారంలో అభివృద్ధి చెందానో అతనికి చెప్పడం మొదలుపెట్టాడు. సరిగా అప్పుడే ఓ నర్సు అక్కడికి పరిగెత్తుకుంటా వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుంది. అమ్మాయా! ఇతన్ని పట్టుకున్నాను అరిచింది ఆ నర్సు. ఇతను నిన్ను కూడా విసిగిసున్నాడా! ఎప్పుడు ఇంటి నుంచి పారిపోయి వస్తుంటాను. ఇతనికి మతిస్థిమితం లేదు. ఇతని బాగోగులు నెను చూస్తుంటాను.
ఎప్పుడూ ఈ పార్క్ కే వస్తూ ఉంటాడు. రెండు సంవత్సరాలుగాఇదే పని. ఎవరినీ ఏమీ అనడు అని చెప్పి అతన్ని తీసుకొని నర్స్ వెళ్లిపోయింది. వ్యాపారవేత్త ఆశ్చర్యానికి లోనయినాడు. కొయ్యబారిపోయూడు. సంవత్సరం పాటు తన దగ్గర పది లక్షల రూపాయలు ఉన్నాయన్న ధైర్యంతో అప్పుల వాళ్లని ఒప్పించగలిగాను. కష్టాలు నుంచి బయట పడగలిగాను. కొద్దిసేపటికే అతనికి అర్థమైంది. తనను సమర్థవంతంగా ముందుకు నడిపించింది. డబ్బు కాదు. తనలో ఏర్పడ్డ ఆత్మవిశ్వాసం. సాధిం చాలన్న కాంక్ష ಅನಿ.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.