Home » హే రంగులే (Hey Rangule) సాంగ్ లిరిక్స్ – అమరన్ (Amaran)

హే రంగులే (Hey Rangule) సాంగ్ లిరిక్స్ – అమరన్ (Amaran)

by Lakshmi Guradasi
0 comment

హే రంగులే (రంగులే)
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగేనే

వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకాశం అందేనే

స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం

సమయానికి తెలిపేదెలా
మనవైపు రారాదని దూరమై పొమ్మని
చిరుగాలిని నిలిపేదెలా
మన మధ్యలో చేరుకోవద్దని

పరిచయం అయినది
మరో సుందర ప్రపంచం నువ్వుగా
మధువనం అయినది
మనస్సే చెలి చైత్రం జతగా

కలగనే వెన్నెల సమీపించేను నీ పేరుగా
హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా

హే రంగులే (రంగులే)
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగేనే

హే వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకాశం అందేనే

స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం

____________________________________________

పాట: హే రంగులే (Hey Rangule)
చిత్రం: అమరన్ (Amaran)
గాయకులు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), రమ్య బెహరా (Ramya Behara)
గీతరచయిత: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswathi Puthra Ramajogayya sastry)
ప్రోగ్రామర్: అస్విన్ సత్య (Aswin Sathya)
నటీనటులు: శివకార్తికేయన్ (Sivakarthikeyan), సాయి పల్లవి (Sai Pallavi)
రచన & దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy)
నిర్మాతలు : కమల్ హాసన్ (Kamal Haasan), సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ (Sony Pictures International Productions), ఆర్. మహేంద్రన్ (R. Mahendran)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment