Home » వేడుకలో (Vedukalo) సాంగ్ లిరిక్స్ – Maa Nanna Super Hero

వేడుకలో (Vedukalo) సాంగ్ లిరిక్స్ – Maa Nanna Super Hero

by Lakshmi Guradasi
0 comments
Vedukalo song lyrics Maa Nanna Super Hero

వేడుకలో ఉన్నది కాలం
వేదిక ఈ కళ్యాణం

వేడుకలో ఉన్నది కాలం
వేదిక ఈ కళ్యాణం
ఏడడుగుల మొదటి ప్రయాణం
జతగా ప్రారంభం

ఆబో… ఆనందాలు
అబ్బా… ఆటంకాలు
అయ్యో… ఆరాటాలు
పెళ్ళికి వచ్చెనంటా

భలే సందర్భాలు
గిల్లె కల్లలాలు
ఎన్నో ఏర్పంధాలు
అన్ని ఉన్నాయంట ఈ చోటా

పందిరిలో సంతోషాల సంత
సందడిగా ఉందే ఊరంతా
చిందులలో మాయం చీకు చింత
ఆగేనా సాగే కేరింత …..

తొందరలో చేసే తప్పులు వంద
విందులలో హుందా గోవిందా
బంధువుగా సరదా విచ్చేసిందా
ఇదంతా ఇంకో కిస్కింద…

పందిరిలో సంతోషాల సంత
సందడిగా ఉందే ఊరంతా
చిందులలో మాయం చీకు చింత
ఆగేనా సాగే కేరింత …..

(సంగీతం)

మండపమంతా బంగారు కాంతులు
నింపిన ఇత్తుల నవ్వుల్లో
గర్వం చూడండోయ్
వీలైతే పొగడండోయ్
పంతులు గారి ప్రతి ఒక మంత్రం
పీపీ డుం-డుం మోతలతో
పొట్టి అందండోయ్
మరి పందెం కాయండోయ్

ఈ అచ్చట్లు ముచ్చట్లు చలికా
దిష్టి తీయండోయ్ జంటకి
ఈ తప్పేట్లు తాళాలు
హోరులో మర్చిపోవద్ద సంగతి

భలే సందర్భాలు
గిల్లె కల్లలాలు
ఎన్నో ఏర్పంధాలు
అన్ని ఉన్నాయంట ఈ చోటా

పందిరిలో సంతోషాల సంత
సందడిగా ఉందే ఊరంతా
చిందులలో మాయం చీకు చింత
ఆగేనా సాగే కేరింత …..

తొందరలో చేసే తప్పులు వంద
విందులలో హుందా గోవిందా
బంధువుగా సరదా విచ్చేసిందా
ఇదంతా ఇంకో కిస్కింద…

____________________________

పాట పేరు : వేడుకలో (Vedukalo)
సినిమా పేరు: మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)
సాహిత్యం : సనాపతి భరద్వాజ పాత్రుడు (Sanapati Bharadwaj Patrudu)
గాయకులు : ఐశ్వర్య దరూరి (Aishwarya Daruri), బృందా (Brinda), చైతు సత్సంగి (Chaitu Satsangi), అఖిల్ చంద్ర (Akhil Chandra)
సంగీతం: జయక్రిష్ (JayKrish)
నటీనటులు : సుధీర్ బాబు (Sudheer Babu), సాయి చంద్ (Sai Chand), సాయాజీ షిండే (Sayaji Shinde) మరియు తదితరులు.
దర్శకుడు: అభిలాష్ కంకర (Abhilash Kankara)
నిర్మాత: సునీల్ బలుసు (Sunil Balusu)

ఇటువంటి మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.