ఒక అడవిలో ఏనుగుల గుంపు ఉండేవి. ఒక ఏడాది వర్షాలు కురవక అడవిలో నీటి ఎద్దడి వచ్చింది. వాగులు కుంటలు ఎండిపోయాయి ఏనుగుల గుంపు దాహంతో అల్లాడిపోయింది నీటిని వెతుక్కంటూ అడవిని వదలి బయటకొచ్చాయి. దూరంగా ఇసుకలో వాటికీ నీరు ఉన్నట్ల కనిపించింది. సంతోషంతో అక్కడికి పరుగుపెట్టాయితీరా అక్కడికి వెళ్లేసరికి నీరు లేకపోవడంతో నీరసించిపోయాయి ఏనుగుల కష్టం పక్క నన్ను తుప్పల్లోంచి చూస్తున్న ఓ కుందేలు వాటి ఎదురుగా వచ్చి ఇలా చెప్పింది. చాలా సేపటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నీటి కోసం చాలా కష్టపడుతున్నారు మీరు ఎండమావిని చూసి నీరు అనుకుంటున్నారు. ఇక్కడికి దగ్గరలో ఒక చెరువు ఉంది. అక్కడికి వెళ్లి మీ దాహం తీర్చుకొండి అని సలహా ఇచ్చింది. కుందేలు మాటలు విన్న ఏనుగులకు కోపం వచ్చింది. మేము తెలివి తక్కువ వాళ్లలా కనిపిస్తున్నామా అంటూ ఒక ఏనుగు కోపంతో కుందేలును తొండంతో పట్టుకొంది ఏంత వేడుకున్నా వినకుండా దానిని నేలకేసి కొట్టింది ఆ దెబ్బకు కుందేలు ప్రాణం విడిచింది.
నీతి: మూర్ఖులకు హితవు చెప్పినా మంచివాళ్లకే నష్టం.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.