పోరు సలపాలిరా.. నువ్ నిలిచి గెలవాలి రా
హే పోరు సలపాలిరా.. నువ్ నిలిచి గెలవాలి రా
జననం నుండి మరణం వరకు
జీవితమంతా జరిగేదేగా
యుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం
ఆత్మబలంతో ముందడుగేసి
ఎపుడూ నీవు గెలుపొందాలి
యుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం
జననం నుండి మరణం వరకు
జీవితమంతా జరిగేదేగా
యుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం
ఆత్మబలంతో ముందడుగేసి
ఎపుడూ నీవు గెలుపొందాలి
యుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం
గుండెలో అలజడులే… రేగినా జడవకులే
ధైర్యమే సదా నీకు సంపద..బాణమై దూసుకుపో
సుడిగాలి ఎదురైనా ఉప్పెనే వస్తున్నా
ఆగకేక్షణం..సాగానీ రణం.. సౌర్యమిక నీనేస్తం
నీ పిడికిలి బిగించి నువ్ ఎదురెళితే
పిడుగులు సైతం తడబడి పోవా
యుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం
ఆత్మబలంతో ముందడుగేసి
ఎపుడూ నీవు గెలుపొందాలి
యుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం
పోరు సలపాలిరా.. నువ్ నిలిచి గెలవాలి రా
హే పోరు సలపాలిరా.. నువ్ నిలిచి గెలవాలి రా
నీ నీడ నిన్నే చూసి ఎగతాళి చేసేస్తున్నా
నిరతము నీ దారంతా ఆపదలు ఎదురావుతున్నా
కొత్తగా ఎత్తులు వేసి తెలివిగా ఎదిరించాలి
తెగువతో ముందుకువెళ్లి నీ జోరు చూపించి చెండాడాలి..
హేయ్ సాధించాలని పట్టుదలుంటే
సాధించలేనిది ఏముంటుంది
యుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం
ఆత్మబలంతో ముందడుగేసి
ఎపుడూ నీవు గెలుపొందాలి
యుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం
పోరు సలపాలిరా.. నువ్ నిలిచి గెలవాలి రా
హే పోరు సలపాలిరా.. నువ్ నిలిచి గెలవాలి రా
నమ్మకం ఆయుధమైతే కలలు ఫలియించును సత్యం
ఎవ్వరేమనుకుంటున్నా నీ దారి నీదే నిత్యం
నేటి నీ అవమానాలే రేపటి బహుమానాలు
నీకు ఓక రోజుస్తుంది.. ఆరోజు లోకం నిను పొగిడేను….
అరె నక్కలు కోటి ఊళ్ళ వేసినా..
సింహ గర్జనకు సాటియగునా
యుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం
ఆత్మబలంతో ముందడుగేసి
ఎపుడూ నీవు గెలుపొందాలి
యుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.