యెములడో యెములాడ
యెములడో యెములాడ ఎండి కొండల రాజన్నో
పైడి కొండల రాజన్న
రాయేసో రాయేసా నా రాగలోన్నీ పిలువయ్యా
వాని రోగం నుండక్కలగాను
మర్రి కింద కూసున్న మందలోడు
తలిగిండే నాకు మందో గిందో పెట్టిండే
వానికి ఎర్రి గిట్ట లేసిందా లేక బర్రె గుణమని అనుకొనా
నన్ను పుట్టెడు గోసల పెడుతుండే
యెములడో రాయేసా లీనంగా నన్నజూడే
కోనేటి రాయేసా నీకు కొబ్బరికాయలు కొడతానే
రాయేసో రాయేసా విని రప రప తరమైతలేదే
వాడు తిప దీప ముసోరోలే తగిలిండే
సోమేషో సోమేషా వాడ్ని సోయికి తీసుకరాయేమే
వాడు సోదో గిదో చెప్తుండే
ఆ.. మర్రి కింద కూసుండి వాడు మందల మలుపుతున్నదే
వాడు ముందుకు జల్దీగా రాడేమే
ఆ.. గిర్రున తిరుగుతున్నాడామే వాడు గిర గిర గిర గిరకొలయిండే
నడు తాటికమ్మల గుడిసోడు
మర్రి అన్న చూడడే వాడు చిర్రు మొర్రు ఆడుతుండే
అంత చిల్లం గల్లం చేసిండే
మర్రి మర్రి చూస్తుండే మందల గాసే నావోడు
వర్రీ వర్రీ పోతుండే తీర్ర మర్రల మాటోడు
రాయేసో రాయేసా విని రప రప తరమైతలేదే
వాడు తిప దీప ముసురుల మాటోడు
అహ సోమేషో సోమేషా వాడ్ని సోయికి జల్దినా లేయెందే
వాడు టికు టాకుల సోకోడు
అగగగో ఎండుగును చూసిండే వాడు గోపాలం వాడిండే
ఇక గోపాలుడై కూసుండే
వాడు పండుగుల కచ్చిండే నాకు పాదములు మంచిగా వాడిండే
నన్ను నిండా ముంచి కూసుండే
కండు కుండా పెట్టిండే
కడుపు నిండి కూసున్నడే
కంటి నిండా కునుకులు తీసిండే
అరె తాటికమ్ముల గుడిసోడు
నాతో కోటకి పడగెత్తినాడే
ఇక మూట ముల్లే సాదిరిండే
ఆహా ఎక్కడి ఎక్కడి ఉంటుండే
కత్తిల మీద కూసుంటుండే
ముద్దెర మాటలాడిండే
వాడు నిద్దుర మాయం చేసిండే
గత్తరిచ్చి పెడుతుండే
ముద్దుల మాటల నా వోడు
వాడు హద్దులు దాటని మొనగాడు
ఆహా సద్దుమనిముంటాడట తిరిగత్తనంటున్నాడే
కొంత సురికియ్యకంటున్నాడే
రాయేసో రాయేసా రంధిని ఆలకించయ్యో
మందిల బదునాం వద్దయ్యా
సోమేషో సోమేషా వందల మొక్కులు పెడతానే
వని ముందుకు జల్దీగా తేయేవే
గాయి గాయి చెత్తుండే
గత్తరించి పెడుతుండే
రాయే పాయే అంటుండే
కూని రాగం తీస్తుండే
రాయేసో రాయేసా వని రౌసును ఓడగొట్టా రాయే
సోమారం కౌజు తిన గాని
సోమేషో సోమేషా మాకు డిస్టో గిట్టో తగిలిందే
మల్ల జీవనం అల్లడిస్తుందే
కలిసి మొక్కులు పెడతామే
ఓ కంట మమ్ము చూడేమే
తోడే మొక్కులు పెడతామే
నీకు కొబ్బరికాయలు కొడతామే
సోమేషో సోమేషా నిన్నే నమ్ముకున్నానే
న్నన్ ఆగం చేయాకే..
__________________
సాహిత్యం, గాయకురాలు: మామిడి మౌనిక (Mamidi Mounika)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Azmeera)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.