నువ్వు పక్కనుంటే బాగుంటాదే
నీ పక్కనుంటే బాగుంటాదే
నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే
కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే
అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంట
ఎళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదే
ఎళ్ళిపోకె శ్యామలా ఎళ్ళమాకె శ్యామలా
నువ్వు వెళ్ళిపోతే అస్సలా
ఊపిరాడదంట లోపలా
ఎళ్ళిపోకె శ్యామలా
ఎక్కి ఎక్కి ఏడవ లేనే
ఎదవ మగ పుటక
గుండె బెరికినట్టుందే నువ్వే ఎళ్ళినాక
ఎళ్ళిపోకె శ్యామలా హే ఎళ్ళమాకె శ్యామలా
నువ్వు వెళ్ళిపోతే అస్సలా
ఊపిరాడదంట లోపలా
ఎళ్ళిపోకె శ్యామలా
హ్మ్.. నరం లేని నాలిక నిన్ను
ఎలిపోమ్మని పంపిందాయే
రథం లేని గుర్రం లాగ
బ్రతుకే చాతికిలపడిపోయే
నీ పోస్టరు అడ్డంగా చింపేసాననుకున్న
గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే
స్విచ్ ఏస్తే ఎలిగెదా
ఉఫ్ఫ్ అంటే ఆరేదా
ఊపిరిలో మంటల్లె నీ ప్రేమే ఉన్నదే
ప్రాణాన్నే.. పట్టకారేసి పట్టేసి
నీతో పట్టుకుపోమాకే
గేలిచేసి నన్నొదిలేసి
సీకటైన కోటలాగా సేయ్యమాకే
నువ్వు ఎల్లిపోకే శ్యామలా
నువేల్లమకే శ్యామలా
ఏమిబాగోలేదే లోపలా
నువ్వు ఎల్లిపోకే ఎల్లిపోకే ఎల్లిపోకే శ్యామలా….. ఆ
మనసుకంటుకున్నదో
మల్లెపూల సెంటు మరక
మరిచిపోదామంటే గుర్తుకొస్తా
ఉందా నిప్పు సురక
ఏటి సేయ్యనోరి సైదులు
గుండెలోన గుచిపోయినాది సూదులు
నానేటి సెయ్య నోరి సైదులు
గుండెలోన గుచిపోయినాది సూదులు
ఎల్లిపోకే శ్యామలా
అట్టా ఎల్లమాకే శ్యామలా
నువ్వేల్లిపోతే అస్సలా
ఊపిరాడదంట లోపల
_______________
Song Credits:
సాంగ్ : ఎల్లిపోకే శ్యామలా (Yellipoke Syamala)
సినిమా పేరు: అఆ ( A Aa)
నటీనటులు: నితిన్ (Nithin), సమంత (Samantha), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran)
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastri)
గాయకుడు: కార్తీక్ (Karthik)
సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
నిర్మాత: కె.రాధాకృష్ణ (K.Radhakrishna)
దర్శకుడు: త్రివిక్రమ్ (Trivikram)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.