ఎక్కు ఎక్కవే రాధమ్మ యెల్లారెడ్డి బండి
వెళ్లిపోదామే రాధమ్మ తిరుపతి బండి
అన్నలున్నారోయ్ ఓ బావ చిటిమిటిలయ్యా
అటులుండురో ఓ బావ చిటిమిటిలయ్యా
ఎక్కు ఎక్కవే రాధమ్మ బుల్లెటూ బండి
వెళ్లిపోదామే రాధమ్మ యమునాల బండి
రాను రానురో ఓ బావ చిటిమిటిలయ్యా
అక్కలున్నారోయ్ ఓ బావ చిటిమిటిలయ్యా
ఎక్కు ఎక్కవే రాధమ్మ పుల్సారు బండి
పారిపోదామే రాధమ్మ పల్లెలు ధాటి
పాలొలున్నారోయ్ ఓ బావ చిటిమిటిలయ్యా
పగ పడతారోయ్ ఓ బావ చిటిమిటిలయ్యా
ఎక్కు ఎక్కవే రాధమ్మ కొనగిరి బండి
వెళ్లిపోదామే రాధమ్మ ఎల్లమ్మ గుడికి
అవ్వ ఆయ్యున్నారోయ్ ఓ బావ చిటిమిటిలయ్యా
ఆగమైతరోయ్ ఓ బావ చిటిమిటిలయ్యా
ఎక్కు ఎక్కవే రాధమ్మ మల్లారెడ్డి బండి
మనసు పడ్డానే ఓ భామ మాటన్నా కలిపే
మంది చుస్తారోయ్ ఓ బావ చిటిమిటిలయ్యా
మాటలొస్తావోయ్ ఓ బావ చిటిమిటిలయ్యా
ఎక్కు ఎక్కవే రాధమ్మ నల్లని కారు
పోరిపోదామే ఓ భామ కొమరిల్లి మనము
అగు అగురో ఓ బావ చిటిమిటిలయ్యా
గుడి పొదమై నా బావ చిటిమిటిలయ్యా
తాళి కడతానే రాధమ్మ నీ మెడలోన
ఏలుకుంటనే ఓ భామ ఎల్లకాలం
కలిసి ఉందామోయ్ నా బావ చిటిమిటిలయ్యా
ఎల్లకాలమోయ్ నా బావ చిటిమిటిలయ్యా
పచ్చని పందిరేసి రాధమ్మ పెళ్లిచేసుకొని
చెయ్యి పట్టుకుంట రాధమ్మ నిన్ను చేసుకుని
అయితే వస్తారో నా బావ చిటిమిటిలయ్యా
చెయ్యి పట్టుకో నా బావ చిటిమిటిలయ్యా
విడిచి ఉండనే రాధమ్మ నీ చెయ్యి నేను
కలిసి ఉంటనే రాధమ్మ నీతో నేను
కోరి వస్తివోయ్ ఓ బావ కొంగు పట్టుకుని
ఏలు బట్టుకో ఓ బావ తాళి కట్టుకుని
నిన్ను మరువనే రాధమ్మ ఎన్ని జన్మలైనా
కలిసి ఉంటనే రాధమ్మ ఏడు జన్మలైనా
మాట మెచ్చిన ఓ బావ చిటిమిటిలయ్యా
నీతో వస్తారో ఓ బావ చిటిమిటిలయ్యా
(మాట మెచ్చిన ఓ బావ చిటిమిటిలయ్యా
నీతో వస్తారో ఓ బావ చిటిమిటిలయ్యా)
నీతో వస్తారో ఓ బావ చిటిమిటిలయ్యా
నీతో వస్తారో ఓ బావ చిటిమిటిలయ్యా
________________________
నటుడు : జోగుల వెంకటేష్ – సౌజన్య
నిర్మాత & ట్యూన్: ఉషక్క
సంగీతం: వెంకట్ అజ్మీరా
సాహిత్యం : కొంగరి కృష్ణ – జోగుల వెంకటేష్
గాయకులు : జోగుల వెంకటేష్ – ఉషక్క
దర్శకత్వం: సౌజన్య
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండ.