Home » ఏదో ఏ జన్మలోదో (Yedho Yejanmalodo) సాంగ్ లిరిక్స్ | Shashtipoorthi

ఏదో ఏ జన్మలోదో (Yedho Yejanmalodo) సాంగ్ లిరిక్స్ | Shashtipoorthi

by Lakshmi Guradasi
0 comments

“ఏదో ఏ జన్మలోదో” పాటను అనన్య భట్ గానం చేయగా, M. M. కీరవాణి సాహిత్యం అందించారు. ఇళయరాజా స్వరపరిచిన ఈ గీతం హృదయాన్ని హత్తుకునే మెలోడీగా వినేవారు ఆకట్టుకుంటోంది. పాటకు నిక్సన్ కొరియోగ్రఫీ అందించిన, ఈ పాట షష్టిపూర్తి చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

Yedho Yejanmalodo song lyrics in Telugu, Shashtipoorthi:

ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం
నీదో నీ వల్ల నాదో ఈ పరవశం
రాగం నీదై పల్లవి నాదై
చరణం చరణం కలిసిన వేళ
ప్రయణాలు ఏ హిమాలయాలకో..

ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం
ఏదో…

అడగను ఎప్పుడు మాయలేడి నడగను ఎప్పుడు
విడువను ఏప్పుడు అడుగులోన అడుగెడుతు..

ఎవరెదురైన నిప్పులాంటి నిజమును కొలిచే
రాముడి కోసం రాయినైనా జానకినై
వేనంటే నీడల వేదనలో తోడులా
నాన్నే నా ప్రాణమై నాన్న కలే సత్యమై
నేనే వెతికే తీగే నన్నే వెతుకుతూ వస్తే

ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం
ఏదో…

తెరలు తెరలుగా తెరుచుకున్న తురుపు ద్వారం
పొరలు పొరలుగా కరుగుతున్న నిశి భారం
పొడుపు కథల్లో పొంచి ఉన్న నిన్నటి సారం
బదులు తెలిసిన వదలలేని మమకారం

కలలన్నీ హాయిగా కలలాగే తోచగా
కలిసుండే కొరికే చిరుగాలై వీచగా
నాలో తపనే నాకై వేచే విరహ కావ్యంలో

ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం
నీదో నీ వల్ల నాదో ఈ పరవశం
రాగం నీదై పల్లవి నాదై
చరణం చరణం కలిసిన వేళ
ప్రయణాలు ఏ హిమాలయాలకో..

ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం
ఏదో…

Yedho Yejanmalodo song lyrics in English, Shashtipoorthi:

Edo e janmalodo ee parichayam
Needo nee valla naado ee paravasham
Ragam needai pallavi nadai
Charanam charanam kalisina vela
Prayanalu e Himalayalako..

Edo e janmalodo ee parichayam
Edo…

Adaganu eppudu mayaledi nadaganu eppudu
Viduvalu eppudu adugulona adugeduthu..

Evareduraina nippulanti nijamunu koliche
Ramudi kosam rayinaina janakinai
Venante needala vedanalo todu laa
Naanne naa pranamai nanna kale satyamai
Nene vetike tige nanne vetukuthu vaste

Edo e janmalodo ee parichayam
Edo…

Teralu teraluga teruchukunna turupu dwaram
Poralu poraluga karugutunna nishi bharam
Podupu kathallo ponchi unna ninnati saaram
Badulu telisina vadhlaleni mamakaram

Kalalanni haayiga kalalaage tochaga
Kalisunde korike chirugaalai veechaga
Naalo tapaney naakai veche viraha kaavyamlo

Edo e janmalodo ee parichayam
Needo nee valla naado ee paravasham
Ragam needai pallavi nadai
Charanam charanam kalisina vela
Prayanalu e Himalayalako..

Edo e janmalodo ee parichayam
Edo…

Song Credits:

పాట పేరు : ఏదో ఏ జన్మలోదో (Yedho Yejanmalodo)
సినిమా పేరు: షష్టిపూర్తి (Shashtipoorthi)
గాయని: అనన్య భట్ (Ananya Bhat)
కొరియోగ్రాఫర్: నిక్సన్ (Nixon)
సాహిత్యం: M. M. కీరవాణి (M. M. Keeravani)
సంగీతం: ఇళయరాజా (Ilaiyaraaja)

ఏదో ఏ జన్మలోదో” పాట విశ్లేషణ:

“షష్టిపూర్తి” చిత్రంలోని “ఏదో ఏ జన్మలోదో” పాట సంగీత ప్రియుల మనసులను హత్తుకునే మెలోడీగా నిలిచింది. అనన్య భట్ తన మధురమైన గాత్రంతో ఈ పాటలో భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తీకరించింది. M. M. కీరవాణి రాసిన సాహిత్యం మనసుకు హత్తుకునేలా, గాఢమైన భావాలతో నిండిపోగా, సంగీత దిగ్గజుడు ఇళయరాజా స్వరపరిచిన ఈ గీతం సంగీత ప్రియులందరికీ మధురమైన అనుభూతిని కలిగిస్తుంది.

నిక్సన్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట దృశ్యపరంగా మరింత హృద్యంగా మారింది. అందమైన సంగీతంతో, సార్ధకమైన సాహిత్యంతో, భావోద్వేగపూరిత గాత్రంతో ఈ పాట సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం!

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.