ఏదేదో పలికే నా పెదవుల మౌనం
నీ పేరే నీ పేరే పిలిచేనులే
నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం
నిన్నేలే నిన్నేలే తలచేనులే
ఏది నీ చిలిపి చిరునవ్వే కురిపించు
ఏది నీ చూపే ఎదలో దించు
ఏది నీ ఊసుల ఉయ్యాల్లో తేలించు
ఏది నీ ఊహను నాకందించు
ఏది నాపై ఇష్టం చూపించు
ఏది ఇప్పుడు దూరం తెంచు
ఏది ఇంకా మైమరుపే పెంచు
ఏది జతగా చెయ్యందించు
చలువ చెలిమి చూపులే
కాలువ కనులు దోచెలే
ప్రేమ పూల జల్లులే
కురిసి మనసు తడిసెలే
మెరిసే రంగుల విల్లులే
ఒడిలో కొచ్చి వాలేలే
శిలలే విరులై మారెలే
పరిమళమేదో పంచేలే
ఏది నీ చిలిపి చిరునవ్వే కురిపించు
ఏది నీ చూపే ఎదలో దించు
ఏది నీ ఊసుల ఉయ్యాల్లో తేలించు
ఏది నీ ఊహను నాకందించు
ఏది నాపై ఇష్టం చూపించు
ఏది ఇప్పుడు దూరం తెంచు
ఏది ఇంకా మైమరుపే పెంచు
ఏది జతగా చెయ్యందించు
ఏదేదో పలికే నా పెదవుల మౌనం
నీ పేరే నీ పేరే పిలిచేనులే
నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం
నిన్నేలే నిన్నేలే తలచేనులే
ఏది ఏది ఏది ఏది
ఏది ఏది ఏది ఏది
_______________
Song Credits:
సాంగ్ : ఏది (Yedhee)
సినిమా: జాబిలమ్మ నీకు అంతా కోపమా (Jaabilamma Neeku Antha Kopama )
గానం: అమల్ సి అజిత్ (Amal C Ajith) & శృతి శివదాస్ (Sruthy Sivadas)
సాహిత్యం: రాంబాబు గోసాల (Rambabu Gosala)
సంగీతం: జివి ప్రకాష్ (GV Prakash)
నటీనటులు: పవిష్ (Pavish), అనిఖా సురేంద్రన్ (Anikha Surendran),
దర్శకుడు: ధనుష్ (Dhanush)
నిర్మాతలు: కస్తూరి రాజా (Kasthoori Raja) & విజయలక్ష్మి కస్తూరి రాజా (Vijayalakshmi Kasthoori Raj)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.