అతడు: నీతోనే నీతోనే ఉంటానే కలలో కూడా నిన్నే
దాటిపోనే పోనే నువ్వేలే నా ప్రాణం అంటానే
విడిచిపెట్టి ఎట్టా ఉంటానే
ఎన్నో ఎన్నో ఆనందాలు ఉన్నపాటుగా
నాలో ఊరికే నాకే అర్ధం నీలో దొరికే
నేను అందుకనే వచ్చా వెనకే
హమ్మో హమ్మో హమ్మో హమ్మమ్మో
అరెరే ఏదో చేసేసావమ్మో
గుండె చప్పుడంతా గంట కొట్టేనంట
నువ్వు పక్కనుంటే అంతే అంతే
అరక్షణమైన దూరంగా ఉంటే
నమ్ముకున్న నేనేమైపోతానే
ఉండిపోవొచ్చుగా ఇలా
ఉండిపోవొచ్చుగా ఇలా
ఎప్పుడు వెంట నీడలా
నువ్విలా నువ్విలా
చుట్టుకోవచ్చుగా ఇలా
పట్టుకోవొచ్చుగా ఇలా
చెప్పలేనంత ప్రేమలా
నన్నిలా నన్నిలా
మ్యూజిక్: య్యా య్యా య్యా
య్యా య్యా య్యా
య్యా య్యా య్యా
చెట్టుమీద చల్లగాలి నన్ను
తాకుతుంటే నువ్వు తాకినట్టు ఉంది ఏంటి
రంగు రంగు వాన విల్లు వంపు చూడగానే నువ్వు
నవ్వినట్టు ఉంది ఏంటి
పావురాల గుంపులోన అల్లరంతా
చూస్తే నువ్వు ఆడినట్టు ఉంది ఏంటి
వాన చుక్కలన్నీ వచ్చి మీద వాలుతుంటే
నువ్వు గుచ్చినట్టు ఉంది ఏంటి ఏంటి
చూడవా చూడవా ఎన్ని వింతనో చూడవా
ఎంత ఏకమై చూడవా పిల్ల నీ వల్ల
వాలవా వాలవా నాలో కొయిలై వాలవా
ప్రేమ పాటలే పాడవా పిల్లా ఓ పిల్లా
ఉండిపోవొచ్చుగా ఇలా
ఉండిపోవొచ్చుగా ఇలా
ఎప్పుడు వెంట నీడలా
నువ్విలా నువ్విలా
చుట్టుకోవచ్చుగా ఇలా
పట్టుకోవొచ్చుగా ఇలా
చెప్పలేనంత ప్రేమలా
నన్నిలా నన్నిలా
ఆమె: నన్ను తప్ప ఎవరిని నువ్వు కలగన్నా
నాకు అది తెలిసిపోదా ఏంటి
మాట వరసకైనా నువ్వు నన్ను మర్చిపోతే
నేను నువ్వు నా ఒళ్ళు పడ్డదేంటి
నీకు మధ్యలోకి ఎవరు అడ్డు వచ్చినా
నవ్వుకుంటూ సర్దుకుంటానేంటి
నువ్వు పొలం మారుతుంది నా వల్ల కాదు అంటే
కంటనీరు ఆగుతుందా ఏంటి ఏంటి
ఎన్నో ఎన్నో భావాలెన్నో ఇన్ని నాళ్ళుగా నాచే మనసే
అన్ని ఇన్ని నీతో తెలిపే రోజు ఎప్పుడని ఎదురే చూసే
అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో
ఇంకో మాటే లేనే లేదయ్యో
గుండె చప్పుడంతా దారి తప్పుతుందే
నువ్వు కొద్దిగైనా మౌనంగా ఉంటె
అరక్షణమైన దూరంగా ఉంటే
నమ్ముకున్న నేనేమైపోతానో
గాలిలో కలిసిపోతానో
నీటిలో కరిగిపోతానో
మంటలో కరిగిపోతానో
తెలియదే తెలియదే
మట్టిలో నిదుర పోతానో
నింగికే ఎగిరి పోతానో
నువ్వు లేక ఏమవుతానో
తేలియాదే తేలియాదే
ఉండిపోవొచ్చుగా ఇలా
ఉండిపోవొచ్చుగా ఇలా
ఎప్పుడు వెంట నీడలా
నువ్విలా నువ్విలా
చుట్టుకోవచ్చుగా ఇలా
పట్టుకోవొచ్చుగా ఇలా
చెప్పలేనంత ప్రేమలా
నన్నిలా నన్నిలా
_______________________________
పాట: ఉండిపోవొచ్చుగా (Undipovachuga)
తారాగణం: బన్నీవాక్స్ (Bunnyvox), వరుణ్ బాబు (Varun Babu)
సంగీతం – నిమ్షి జక్కయ్యస్ (Nimshi zacchaeus)
సాహిత్యం – సురేష్ బనిశెట్టి (Suresh Banisetti)
గాయకులు -రితేష్ జి రావు (Ritesh G rao ), అదితి భావరాజు (Aditi bhavaraju )
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.