మనే సంధ్య పొద్దుల
దీపాల వెలుగుల్ల
దిగిరావే అందాల బంగారు బొమ్మ
మురిపాల నవ్వుల
పొలమారే సూపుల
ఏముందో మర్మము ఓ కొంటె పిల్లగా
పట్టు పరికిణి కట్టినవే పిల్ల
మల్లె మొగ్గలు సుట్టి రావే ఇలా
పాల పొంగులతోని కదిలే నీ అడుగుల్ల
పులా తేనెల మీద తునీగై వస్తున్న
మిట్ట తామరిగట్ల మీద
ముద్దుల చుట్టము మనుగురినావు ఈవేళ
పైరుగాలులు వీచే నీ ప్రేమ జోగుల్ల
పడని బావ నేను నీ మాయ మాటల్ల
మనే సంధ్య పొద్దుల
దీపాల వెలుగుల్ల
దిగిరావే అందాల బంగారు బొమ్మ
పజొన్న సేనుల్ల పరువాల కాంకోలే
సిరులెన్నో ఒలికేవే సుగుణాల గుమ్మ
పరదాల వెనుకున్న సరదాల చిన్నోడా
నీ సాటు సైగలు చాలించవయ్యా
మాఘమాసం గడియాలల్ల ఓ పిల్ల
మసాగా మబ్బులు కమ్మినాయే నీలోన
నక్షత్ర దారుల నువ్వు నడిచి నువ్వొస్తుంటే
ఊరంతా దీపాలు వెలిగే నీవల్ల
అల్లాడిరేగుచెట్ల మీది ఓ పిల్లగా
అలసి నిద్రపోయినదో వెన్నెల
చల్ల చల్ల వాన చినుకులో రాలంగా
మెల్ల మెల్లగా వాలే మెరుపుల నేనిన్న
మనే సంధ్య పొద్దుల
దీపాల వెలుగుల్ల
దిగిరావే అందాల బంగారు బొమ్మ
కొలనులోన ఎగిరేటి అరుదైన చేపల్లే
కలలోన మెరిసావే ఓ కలువ రెమ్మ
హేమంత ఋతువుల్ల పూబంతి మాటల్ల
నీ మాయి ప్రేమలు తెలిసొయ్ పిల్లగా
కొత్త పువుల పరిమళాల ఓ పిల్ల
కోరి రమ్మని పిలవరాదె నీ వెంట
పడుచు మందారాల పరవళ్లు ఘటంగా
నీలి సంద్రాలల్ల నీతోడు నేనుంటా
ఎండ మావుల ధోవలల్లా చూడంగా
ఎదురు సూపులకై ఈ వేళా
పల్లె అంచుల మీది పరుగుల్ల నేనున్న
తల్లి దండ్రుల మాట జవదాటి రాకున్న
మనే సంధ్య పొద్దుల
దీపాల వెలుగుల్ల
దిగిరావే అందాల బంగారు బొమ్మ
ఏడేడు వర్ణాల హరివిల్లు నీవై
ఎదురుంగా నిలిచావే మధురాల గుమ్మ
పల్లెసీమా దారుల్ల అడుగులు వెయ్యంగా
నిన్ను కోరి వస్తున్నా వరసైన బావ
ఏటి కొంగల జంట వోలె ఓ పిల్ల
ఎంత ముద్దుగా వాలినవే గుండెల్ల
నిండు సూర్యుని వోలె
నీ కంటి వెలుగుల్ల
నిండు జన్మల తోడు నేనుంటా ఓ పిల్ల
మగలిపువ్వుల నవ్వుతోటి ఓ బావ
మనసు నిండుగా చేరినావు ఈ వేళా
ఎతైన గుండెల్ల లోతైన లోయల్లా
మైలు రాళ్లను ధాటి మనువాడా వస్తున్న
(మైలు రాళ్లను ధాటి మనువాడా వస్తున్న)
______________________________________
పాట: దీపాల వెలుగుల్లా (Dipala Velugulla )
సాహిత్యం: మహేందర్ ముల్కల (Mahender Mulkala)
సంగీత దర్శకుడు: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
గాయని : సుమన్ బదనకల్ & శ్రీనిధి (Suman Badanakal&Srinidhi)
నటీనటులు : సుమన్ బదనకల్ (Suman Badanakal) యమునా తారక్ (Yamuna Tarak )
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.