యద యద సవ్వడి చేసెను సందడి
నువ్వు నన్ను తాకగా రేగెను అలజడి
అట్ట అట్ట సూడకే
ఎట్ట ఎట్ట ఆపనే
పొంగుతున్న ప్రేమనే పిల్లా
యద యద సవ్వడి
కదిలే కడలి పై ఎగిసే అలలతో
మనసంతా ఊగిపోయెనే
యద యద సవ్వడి చేసెను సందడి
నిన్న మొన్న లేనిది కొత్తగా ఉందిది
మొడుబారిన మొక్కల నిలిచి ఉన్న చూడవా
రంగు రంగు పువ్వులా పూసి పోవే నాపై ఇలా
ఏండి పోయిన నేలలా
ఉండి పోయా నేనిలా
ఉరుముతున్న మేఘమై
తడిపి పోవే జల్లులా
నీలి నీలి నింగిలో ఎగిరేటి పక్షినై
హరివిల్లు చెంత చేరనా
యద యద సవ్వడి చేసెను సందడి
నువ్వు నన్ను తాకగా రేగెను అలజడి
అట్ట అట్ట సూడకే
ఎట్ట ఎట్ట ఆపనే
పొంగుతున్న ప్రేమనే పిల్లా
____________________________
సినిమా పేరు – కన్యాకుమారి (KanyaKumari)
గానం – అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), జయశ్రీ పల్లెం (Jayasri Pallem)
సాహిత్యం – సృజన్ అట్టాడ (Srujan Attada))
రచన, దర్శకత్వం & నిర్మాత: సృజన్ అట్టాడ (Srujan Attada)
సంగీతం – రవి నిడమర్తి (Ravi Nidamarthy)
తారాగణం – గీత్ సైనీ (Geeth Saini), శ్రీ చరణ్ రాచకొండ (Sree Charan Rachakonda)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.