Home » యాలో యాలా (Yaalo Yaalaa) సాంగ్ లిరిక్స్ ANIMAL (Telugu)

యాలో యాలా (Yaalo Yaalaa) సాంగ్ లిరిక్స్ ANIMAL (Telugu)

by Lakshmi Guradasi
0 comments
Yaalo Yaalaa song lyrics Animal

హో యాలో యాలా యాలోరే…
హో యాలో యాలా యాలోరే…
హో ఎన్నో ఏండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె
హో ఎన్నో యేండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె

హో యాలో యాలా యాలోరే…
హో యాలో యాలా యాలోరే…
ఎన్నో ఏండ్ల ఆకలికి
యాట మోద్ధలైందయ్యో ఈ యాలె
ఎన్నో యేండ్ల ఆకలికి
యాట మోద్ధలైందయ్యో ఈ యాలె

మండేటి ఎండల నుండి
ఎగసిపడే సూరీడుల వస్తా
కమ్మేటి మబ్బులు కాల్చి
నీ సుట్టు ఏన్నెల్లు పొంగిస్తా

నింపేసుకుంటా నిన్ను నాలోనా
అచ్చేసుకుంటా నిన్ను నా మీన
మొక్కేది నిన్నే ఎపుడైనా
నా సామి వంటే నువ్వే లోకానా

సెమ్మా సేరదు మీ కంటా
ఓ సెమ్మా సేరదు మీ కంటా
అమ్మ తోడు నేనుండంగా
మీకు ఆపదే రాదంటా

ఓ పిడుగై నేనటే రానా
ఓ బడాబాగ్నులు ఈదైనా
భూమినైనా బుగ్గి సేసెయ్ నా
నీకు ఏమన్నైతే నాన్నా
భూమినైనా బుగ్గి సేసెయ్ నా
నీకు ఏమన్నైతే నాన్నా

బతికేదే మీ కోసం
ఈ బతుకే మీ దయా కోసం
మీరే లేరనే ఓ మాట
నిజం కాకున్నా నను సంపేయ్ దా
అది అనేటి ఏ నోరైనా
దాన్ని ఆడే తవ్వి పాతేయ్ నా

ఓ నువ్వు సేసిన బొమ్మనయా
ఓ నువ్వు సేసిన బొమ్మనయా
ఓ నువ్వే దాని పానమయా
నీ పేరే దానిలయా
ఓ నువ్వే దాని పానమయా
నీ పేరే దానిలయా

తోడేలు నీకెల్లి తోకలను జాడిత్తే సింగమై రానా
ఏటాడి ఎటులేసి నెత్తుటేర్లు పారించే నేలనైపోనా
ఓ తోడేలు నీకెల్లి తోకలను జాడిత్తే సింగమై రానా
అ ఏటాడి ఎటులేసి నెత్తుటేర్లు పారించే నేలనైపోనా నేలనైపోనా

ఒక్క నిజం ఒప్పుకున్నా నాన్న
ఒక్క నిజం ఒప్పుకున్నా నాన్న
ఎంత దూరం ఎల్లె పోరైనా
దెగ్గరోల్ల తోనే అవ్నా
ఎంత దూరం ఎల్లె పోరైనా
దెగ్గరోల్ల తోనే అవ్నా

హో యాలో యాలా యాలోరే…
హో యాలో యాలా యాలోరే…
నీ సావునే సంపేసిందే
నువ్వు పంచినా నీ నెత్తురే
నీ సావునే సంపేసిందే
నువ్వు పంచినా నీ నెత్తురే

________________________

పాట: యాలో యాలా (Yaalo Yaalaa)
చిత్రం: యానిమల్ (ANIMAL)
గాయకులు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
లిరిక్స్ : అనంత శ్రీరామ్ (Ananta Sriram)
సంగీత దర్శకుడు: జాని (Jaani),
నటీనటులు : రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక (Rashmika)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.