Home » ఏమోనే – దీప్తి సునయన

ఏమోనే – దీప్తి సునయన

by Kusuma Putturu
0 comments

ఉండిపో, ఉండిపో ఉండిపోవే

గుండెలో చప్పుడై నాతో

ఉండిపో ఉండిపో ఉండిపోవే

ఊపిరై వెచ్చగా నాలో

అందమైన ఏదో లోకం

అందుతోంది నీతో ఉంటే

అంతులేని ఏదో మైకం

ఆగమన్న ఆగనంటోందే

పట్టాసై పేలే ప్రేమలో

మటాషై పోయా మత్తులో

పరాకే కమ్మే హాయిలో

పతంగై ఎగిరా నింగిలో

లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా

కోల కోల కళ్ళతోటి… చంపకే పిల్లా

లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా

వేల వేల ఊహల్లోన ముంచకే పిల్లా

నిన్ను తప్ప నన్ను నేను గుర్తుపెట్టుకోనే

ఎందుకింత ఇష్టమంటే.. ఏమోనే ఏమోనే

నీకున్నట్టే నాలో కూడా… ఇష్టం ఉన్న అంటే

ఉన్నపాటు చెప్పమంటే… ఏమోలే ఏమోలే

ప్రతి మాటే తీయని వరమే

ప్రతి చూపు పరవశమే

ప్రతి మాటే తీయని వరమే

ప్రతి చూపు పరవశమే

వేరు వేరు చేసిపోదు లేమ్మా

వేరులాగ పట్టుకున్న ప్రేమ… ప్రేమ, ప్రేమ

లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా

కోల కోల కళ్ళతోటి చంపకే పిల్లా

లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా

వేల వేల ఊహల్లోన ముంచకే పిల్లా

ఉండిపో ఉండిపో ఉండిపోవా

కంటికే రెప్పలా నాతో

ఉండిపో ఉండిపో ఉండిపోవా

నీడలా ఎప్పుడు నాతో

అల్లుకుంది ఏదో బంధం

అందుకనే ఇంతానందం

ఇద్దరిని కలిపెను కాలం

మరువను జీవితకాలం

పట్టాసై పేలే ప్రేమలో

మటాషై పోయా మత్తులో

హఠాత్తుగా జరిగే తంతులో

అమాంతం ఎన్ని వింతలో

లాల లాల, లాల లాల లాల లల్లల్లా లా

చల్ల చల్ల గాలే నన్ను తాకనే నీలా

లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా

అల్లిబిల్లి అల్లరేదో రేగెనే చాలా

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కోసం తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment