విజయవాడలో వెలసిన దుర్గమ్మా
నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మా
మెడలో దండలు వేసినమమ్మా
మెండుగ మమ్ము దీవించరావమ్మా
విజయవాడలో వెలసిన దుర్గమ్మా
నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మా
మెడలో దండలు వేసినమమ్మా
మెండుగ మమ్ము దీవించరావమ్మా..
పూలు పండ్లతో పూజలు నీకు
అన్న పూజలతో అర్చన నీకు
పూలు పండ్లతో పూజలు నీకు
అన్న పూజలతో అర్చన నీకు
పచ్చ పచ్చని గాజులు నీకు
పట్టు పీతాంబ్రాలే నీకు
పచ్చ పచ్చని గాజులు నీకు
పట్టు పీతాంబ్రాలే నీకు
కనుములు కట్నాలు పెట్టేమమ్మా
కనకదుర్గ మము కాపాడరావమ్మా
విజయవాడలో వెలసిన దుర్గమ్మా
నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మా
మెడలో దండలు వేసినమమ్మా
మెండుగ మమ్ము దీవించరావమ్మా..
నిన్ను చూడని కన్నులెందుకు
నిను కొలువని మా దేహమెందుకు
నిన్ను చూడని కన్నులెందుకు
నిను కొలువని మా దేహమెందుకు
నీ పాట పాడని గళము ఎందుకు
నిను స్మరించని హృదయమెందుకు
నీ పాట పాడని గళము ఎందుకు
నిను స్మరించని హృదయమెందుకు
గుండెలనిండా భక్తి నింపుకొని
దండిగ పూజలు చేస్తున్నామమ్మా
విజయవాడలో వెలసిన దుర్గమ్మా
నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మా
మెడలో దండలు వేసినమమ్మా
మెండుగ మమ్ము దీవించరావమ్మా..
పాడిపంటలు పదిలంగా చూసే
పరమపావని నీవేనమ్మా
పాడిపంటలు పదిలంగా చూసే
పరమపావని నీవేనమ్మా
పిల్లాపాపలను సల్లంగా చూసే తల్లివి
నీవే మా దుర్గమ్మా
పిల్లాపాపలను సల్లంగా చూసే తల్లివి
నీవే మా దుర్గమ్మా
వరుణ దేవతల వచ్చి మా భూమి
మాగాణి చేసి పంటలు పండించవా..
విజయవాడలో వెలసిన దుర్గమ్మా
నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మా
మెడలో దండలు వేసినమమ్మా
మెండుగ మమ్ము దీవించరావమ్మా..
నిన్ను తలవని భక్తులు లేరు
నిన్ను కొలువని జనులే లేరు
నిన్ను తలవని భక్తులు లేరు
నిన్ను కొలువని జనులే లేరు
భక్తకోటికి అండగా ఉంటూ
భయబ్రాంతులను తొలగించేవు
భక్తకోటికి అండగా ఉంటూ
భయబ్రాంతులను తొలగించేవు
విజయాలెన్నో చేకూర్చంగా
విజయవాడలో కొలువైనావమ్మ
విజయవాడలో వెలసిన దుర్గమ్మా
నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మా
మెడలో దండలు వేసినమమ్మా
మెండుగ మమ్ము దీవించరావమ్మా..
విజయవాడలో వెలసిన దుర్గమ్మా
నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మా
మెడలో దండలు వేసినమమ్మా
మెండుగ మమ్ము దీవించరావమ్మా..
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
