వేంకట రమణ తండ్రి వేంకట రమణ….
తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ
ఏడుకొండలవాడ వేంకట రమణ గోవిందా గోవింద
వేంకట రమణ తండ్రి వేంకట రమణ….
తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ //వేంకటరమణ// ….
1. తెల్లవారు జాముల్లో వేంకట రమణ తండ్రి… సుప్రభాతము చేసెను సురులే రమణ….
పంచామృతమ్ములతో వేంకట రమణ తండ్రి…నిత్యభిషేకములే నిత్యము రమణ…
వజ్రమకుటంబతో వేంకట రమణ తండ్రి…శంఖూ చక్ర దారుడవే తిరుమల రమణ
మూడు నామాలతో వేంకట రమణ తండ్రి…ముల్లోకములను ఏలేడి మూర్తివి రమణ
//వేంకటరమణ// ….
2. నీలాల కన్నులతో వేంకట రమణ తండ్రి…నీలమేఘశ్యామా తిరుమల రమణ
అందాల అధరము ఫై వేంకట రమణ తండ్రి…పాలపట్టి నవ్వులయ్య తిరుమల రమణ
నల్లని వాడవయ్య వేంకట రమణ తండ్రి…సుందరా కారుడవే తిరుమల రమణ
ఓం కార రూపుడవే వేంకట రమణ తండ్రి…ఉగ్రనరసింహుడవే వేంకట రమణ
//వేంకటరమణ// ….
3. మృదువైన హృదయముఫై వేంకట రమణ తండ్రి…పద్మవతి మంగళ నిలయము రమణ..
వేద వేదాoగములె వేంకట రమణ తండ్రి…సామవేదానికి సరి సారధి రమణ
వెన్న ముద్దల దొంగ వేంకట రమణ తండ్రి…ముల్లోకముల మోహన మురళివి రమణ
వైకుంట వాసుడవే వేంకట రమణ తండ్రి… వాసుదేవుడవయ్యా వేంకట రమణ
//వేంకటరమణ// ….
4. ఏకాంతసేవలలో వేంకట రమణ తండ్రి…శ్రీకాంత సేవలతో తిరుమల రమణ
వరాలు వర్షింపగా వేంకట రమణ తండ్రి…వరాహమూర్తివయ్యా వేంకట రమణ
ప్రత్యక్ష దైవముర వేంకట రమణ తండ్రి…ఆది నారాయణుడీవే తిరుమల రమణ
అలివేలు మంగాపతి వేంకట రమణ తండ్రి…అనురాగమూర్తివయ్యా తిరుమల రమణ
//వేంకటరమణ// ….
5. వశిష్ట వందిత శ్రీ వేంకట రమణ తండ్రి…వైకుంట వాసుడవే తిరుమల రమణ
మోక్షసాదన నీవే వేంకట రమణ తండ్రి…మోక్షద్వారము నీవే తిరుమల రమణ
కారుణ్య మూర్తివయ్యా వేంకట రమణ తండ్రి…కటాక్ష వీక్షనలే తిరుమల రమణ
గోవింద గోవింద వేంకట రమణ తండ్రి…గోవింద రాజువయ్య గోకుల రమణ
//వేంకటరమణ// ….
6. సహస్ర మూర్తి అడుగో వేంకట రమణ తండ్రి…ఆనందనిలయము ఫై వేంకట రమణ
భక్త జనులను గావక వేంకట రమణ తండ్రి…శ్రోత్రణ లాలించేడి తిరుమల రమణ
అనంతపద్మనాభ వేంకట రమణ తండ్రి…అఖండ తేజముతో తిరుమల రమణ
అశేష భక్తులతో వేంకట రమణ తండ్రి…విశేష పూజలతో వేంకట రమణ
//వేంకటరమణ// ….
7. సిద్ది బుద్దుల నిచ్చెడి వేంకట రమణ తండ్రి…శేషాద్రి శేఖరుడె తిరుమల రమణ
అనాది నాధుడవే వేంకట రమణ తండ్రి…పుండరీ కాక్షుడవే తిరుమల రమణ
వర వేంకటాద్రిశ వేంకట రమణ తండ్రి…వామనవతారముతో తిరుమల రమణ
కోటి విద్యల నిచ్చేడి స్వామివిరా శ్రీ రమణ…. కోదండ పాణివయ్య వేంకట రమణ
//వేంకటరమణ// ….
8. దశావతారమూలె వేంకట రమణ తండ్రి…ధర్మ సంస్థాపకుడే తిరుమల రమణ
పద్మావతి దేవితో వేంకట రమణ తండ్రి…ప్రసన్నమూర్తివయ్యా వేంకట రమణ
ఆద్యంతమూ నీవే వేంకట రమణ తండ్రి…అంజనాద్రిసూడవే తిరుమల రమణ
చిత్రాలకే చిత్రము వేంకట రమణ తండ్రి…నీ రూప సౌందర్యము వేంకట రమణ
//వేంకటరమణ// ….
9. సంసారం సాగరమును వేంకట రమణ తండ్రి…దాటించువాడవే తిరుమల రమణ
లోకాల ఏలికతో వేంకట రమణ తండ్రి…భక్త జన పాలకుడే తిరుమల రమణ
బాస జన పోషకుడే వేంకట రమణ తండ్రి…దారిద్ర నాసినివె తిరుమల రమణ
అజ్ఞానమే బాపగ వేంకట రమణ తండ్రి…విజ్ఞానాల నిచ్చేడి ఓ వేంకట రమణ
//వేంకటరమణ// ….
10. మధురాతి మధురములే వేంకట రమణ తండ్రి…నీ నామ సంకీర్తన మధురము రమణ
సప్త వాహనములపై వేంకట రమణ తండ్రి…దీవించు హస్తముతో తిరుమల రమణ
అండపిండ బ్రహ్మాండము వేంకట రమణ తండ్రి…విధాతయే కడిగిన పాదము రమణ
పరిమళ గంధముతో వేంకట రమణ తండ్రి…చందనోత్సవములయ్య వేంకట రమణ
//వేంకటరమణ// ….
11. సాగర మధనంలో వేంకట రమణ తండ్రి…కూర్మావతారుడవే తిరుమల రమణ
యేలేటి వాడవయ్యా వేంకట రమణ తండ్రి…క్షిరాబ్ది కన్యక తో తిరుమల రమణ
స్మరించినంతనే శ్రీ వేంకట రమణ తండ్రి…వరించు వరములతో వేంకట రమణ
వడ్డీ కాసుల వాడే వేంకట రమణ తండ్రి…వజ్రాల కవచముతో తిరుమల రమణ
//వేంకటరమణ// ….
12. భారతఖండము నందున వేంకట రమణ తండ్రి…భాగ్యాల పంటవయ్యా తిరుమల రమణ
ప్ప్రకృతి వికృతి శ్రీ వేంకట రమణ తండ్రి…కాల గమనము నీవే తిరుమల రమణ
సహస్త్ర శాస్త్రాలను వేంకట రమణ తండ్రి…రచించు వాడవులే తిరుమల రమణ
భోగ భాగ్యాలతో వేంకట రమణ తండ్రి…బాల బాలాజీ శ్రీ తిరుమల రమణ
//వేంకటరమణ// ….
13. నిత్య సత్యము వాడే వేంకట రమణ తండ్రి…సత్యనారాయణుడే తిరుమల రమణ
నారద తుంబురులే వేంకట రమణ తండ్రి…నీ నామ సంకీర్తన చేతురు రమణ
నీ పాదపద్మాలకు వేంకట రమణ తండ్రి…పారిజాతమ్ములతో అర్చన రమణ
గోవింద గోపాల వేంకట రమణ తండ్రి…మయూర పింఛముతో వేంకట రమణ
//వేంకటరమణ// ….
14. శృంగార మూర్తివయ్యా వేంకట రమణ తండ్రి…శ్రీ రంగనాథుడవే వేంకట రమణ
ఊగేటి ఊయలపై వేంకట రమణ తండ్రి…తులతూగు వాడవులే వేంకట రమణ
కస్తూరి తిలకముతో వేంకట రమణ తండ్రి…కారుణ్య మూర్తివయ్యా తిరుమల రమణ
పదివేల శేషుల పై వేంకట రమణ తండ్రి…పవళించు వాడవయ్యా వేంకట రమణ
//వేంకటరమణ// ….
15. ముల్లోకములనేలేడి వేంకట రమణ తండ్రి…మత్స్యావతారుడవే తిరుమల రమణ
పావనకారముతో వేంకట రమణ తండ్రి…పరశురాముండితడే తిరుమల రమణ
ఏడుకొండలవాడ వేంకట రమణ తండ్రి…బౌద్ధ కల్కివి నీవే తిరుమల రమణ
నీదావతారములే వేంకట రమణ తండ్రి…కీర్తింప మా తరమ తిరుమల రమణ
//వేంకటరమణ// ….
16. అఖండ జ్యోతులతో వేంకట రమణ తండ్రి…అష్టలక్ష్ములు కొలువే
లోకాల పోషకుడే వేంకట రమణ తండ్రి…శోక నాశకుడితడే తిరుమల రమణ
వేదాల ఘోషలతో వేంకట రమణ తండ్రి…మోసేటి పల్లకి పై తిరుమల రమణ
సర్వాంగ సుందరుడే వేంకట రమణ తండ్రి…సౌఖ్య ధ్వరము నీవే తిరుమల రమణ
//వేంకటరమణ// ….
17. అభిష్ట వరదాయక వేంకట రమణ తండ్రి…కలియుగ దైవమురా తిరుమల రమణ
అన్నమయ్య కీర్తనలే వేంకట రమణ తండ్రి…ముద్దుగుమ్మ వేరములయ్యా తిరుమల రమణ
భక్తి సామ్రాజ్యమునే వేంకట రమణ తండ్రి… పాలించువాడవయ్యా తిరుమల రమణ
ముత్యాల నవ్వులతో వేంకట రమణ తండ్రి…జీవకోటికి పోషణ చేస్తువు రమణ
//వేంకటరమణ// ….
18. పచ్చని తోరణము వేంకట రమణ తండ్రి…నిత్య కళ్యాణములే నిత్యము రమణ
శ్రీదేవి భూదేవితో వేంకట రమణ తండ్రి…కల్యాణ మూర్తివయ్యా తిరుమల రమణ
భక్తి సాగరమందున వేంకట రమణ తండ్రి…ముక్తి కెరటము నీవే తిరుమల రమణ
నిన్ను చూడ వచ్చేని భక్తులు రమణ తండ్రి… గోవింద ఘోషలతో ముగ్దులు రమణ.. గోవిందా
//వేంకటరమణ// ….
See Also plz click on this: choodarandamma-song-lyrics-gopika-poornima
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
