Home » వెండిమిన్ను నీవంట (Vendiminnu Neevanta) సాంగ్ లిరిక్స్ – Amaran

వెండిమిన్ను నీవంట (Vendiminnu Neevanta) సాంగ్ లిరిక్స్ – Amaran

by Lakshmi Guradasi
0 comments
vendiminnu neevanta song lyrics amaran telugu

శివ కార్తికేయన్ మరియు సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఈ సినిమాలో శివ కార్తికేయన్ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న 2024 లో విడుదల అయింది. G.V ప్రకాష్ సంగీతం ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోసినట్టు అనిపిస్తుంది.

పాట వివరణ:

ఈ సినిమాలో వెండి మిన్ను నీవంట పాట బాగా పాపులర్ అయింది. తాను ఆర్మీ లో ఉండడం వలన శివ కార్తికేయన్ (ముకుందరాజన్) ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చేది ఆ సమయం లో వీళ్ళు ఇద్దరు దూరంగా ఉన్నా ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను అని ఈ పాట తెలుపుతుంది. వెండిమిన్ను నీవంట నెల కన్ను నేనంట ఎంత దూరం ఉన్న నిన్నే రెప్పలపు చూస్తుంట అంటే నువ్వు మెరిసే ఆకాశం నేను నేల కన్ను ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉంటాను సో నాకు నువ్వు ఎప్పుడు దగ్గరగా ఉంటావు అని అర్ధం. మరి ఈ పాటని మీ లాంగ్ డిస్టెన్స్ రేలషన్ లో ఉన్న వాళ్ళ కోసం పడేయండి.

వెండి మిన్ను నీవంట సాంగ్ లిరిక్స్ తెలుగు లో

వెండి మిన్ను నీవంట
నేల కన్ను నేనంట

వెండి మిన్ను నీవంట
నేల కన్ను నేనంట
ఎంత దూరమున్న నిన్నే
రెప్పలాపు చూస్తుంట

నాకు నేను లేనంట
ఆదమరచి పోతుంట
అంతులేని ఆలోచనగా
నీతో అడుగు వేస్తుంట

ఈ వసంతం ఎందుకంట
నీ పెదాన్నై నవ్వుకుంట
కాలమై నీతో కలిసుంట…

వెండి మిన్ను నీవంట
నేల కన్ను నేనంట
ఎంత దూరమున్న నిన్నే
రెప్పలాపు చూస్తుంట

వెండి మిన్ను నీవంట
నేల కన్ను నేనంట

నువ్వు నేను మనమిద్దరంటే
ఎవ్వరన్న అది తప్పు మాటే
నిన్ను నన్ను జత కలుపుకుంటే
ప్రేమనేది బహు చిన్న మాటే

నీ కాంతిలో నేనుంటే ఏకాంతమే లేదంతే
నా కన్నులకు నీ కల కంటే ప్రపంచమే లేదంది
నిన్ను చూస్తూ నిదుర లేస్తా రోజు తెల్లారితే

వెండి మిన్ను నీవంట
నేల కన్ను నేనంట
ఎంత దూరమున్న నిన్నే
రెప్పలాపు చూస్తుంట

నాకు నేను లేనంట
ఆదమరచి పోతుంట
అంతులేని ఆలోచనగా
నీతో అడుగు వేస్తుంట

ఈ వసంతం ఎందుకంట
నీ పెదాన్నై నవ్వుకుంట
కాలమై నీతో కలిసుంట…

Vendi minnu neevanta Song Lyrics in English

Vendi minnu neevanta
Nela kannu nenanta
Entha dooramunna ninne
reppalaapi chusthunta
Naaku nenu laenantaa
Aadamarchipothuntaaa
Anthuleni aalochanagaa
Néetho adugu vesthuntaa
Eee vasantham…. Mmm…
Endhukanthaaaa….. Aaa…
Née pedhaannai navvukuntaa
Kalamai …Neetho Kalisuntaaa..

Vendi minnu neevanta
Nela kannu nenanta
Entha dooramunna ninne
reppalaapi chusthunta
Vendiminnu neevanta
Nela kannu nenanta

Nuvvu nenu manamiddarante
evaranna adhi tappu maate
ninnu nannuuu jathakalupukunte
premanedhi bahu chinna maate
nee kaanthilo nenunte
yekanthame ledhanthe
naa kannulaku nee kala
kante prapanchame ledhanthe
ninnu choosthu nidralestha
roju thellarithe…

Vendi minnu neevanta
Nela kannu nenanta
Entha dooramunna ninne
reppalaapi chusthunta
Naaku nenu laenantaa
Aadamarchipothuntaaa
Anthuleni aalochanagaa
Néetho adugu vesthuntaa
Eee vasantham…. Mmm…
Endhukantaaaa….. Aaa…
Née pedhaannai navvukuntaa
Kalamai …Neetho Kalisuntaaa..

Song Credits

పాట: వెండిమిన్ను నీవంట (Vendiminnu Neevanta)
చిత్రం: అమరన్ (Amaran)
గాయకులు : కృష్ణ తేజస్వి (Krishna Tejasvi), శిరీషా భాగవతుల (Sireesha Bhagavatula)
సాహిత్యం – రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
నటీనటులు: శివకార్తికేయన్ (Sivakarthikeyan), సాయి పల్లవి (Sai Pallavi)
రచన & దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)

Amaran Movie Songs Lyrics

Vaane Vaane song lyrics Amaran telugu

Amara Samara song lyrics Amaran telugu

Hey Rangule song lyrics Amaran

Azadi song lyrics Amaran

Usure Usure song lyrics Amaran

Kalave Song Lyrics Amaran telugu

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.