Home » వెలుగు చీకటిలోన సాంగ్ లిరిక్స్ – సప్తగిరి ఎక్సప్రెస్

వెలుగు చీకటిలోన సాంగ్ లిరిక్స్ – సప్తగిరి ఎక్సప్రెస్

by Nithishma Vulli
0 comments
velugu chikatilona song

సింగర్ : విజయ్ బుల్గనిన్

మ్యూజిక్  : బుల్గనిన్

లిరిక్స్ : చైతన్య వర్మ


వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న

వదిలేసావా నన్నే ఎడబాటునా

కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని

పసివాన్నేలే ఇంకా ఎదమాటున

మదిలో ఎంతో దిగులే ఉన్నా

నవ్వుతూ నన్నే పెంచావు నాన్న

కరిగే మైనం నువ్వవుతున్నా

నిషిలో వెలుగై నడిపావు నాన్న

వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న

వదిలేసావా నన్నే ఎడబాటునా

కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని

పసివాన్నేలే ఇంకా ఎదమాటున

నువ్ కరుణిస్తే కను తెరిచా

నువ్ నడిపిస్తే నే నడిచా

నువ్ చూపిస్తే జగమెరిగాను

నువ్ కధ చెబితే మైమరిచా

నీ ఎదపైనే నిదురించా

నీ కొడుకై తరియించాను

నువ్వే లేని నేనే లేను

నువ్వు నేను వేరే కాము

నాలో నేను నువ్వే న్నాన్న

మదిలో ఎంతో దిగులే ఉన్నా

నవ్వుతూ నన్నే పెంచావు నాన్న

కరిగే మైనం నువ్వవుతున్నా

నిషిలో వెలుగై నడిపావు నాన్న

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.