వేల అక్షరాలు కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వార్ధం లేని రూపం అమ్మే కదా
ఎంత నిండుగా నీడనిచ్చినా
ఎండ తప్పని చెట్టే అమ్మా
కంటి నిండుగా నీరే పొంగినా
రెప్ప మూయని చూపే అమ్మ
తానో స్వర్గం తానో దుర్గం
అనితర సాధ్యం తన మార్గం
వేల అక్షరాలు, కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వార్ధం లేని రూపం అమ్మే కదా
నేరం నీదా కాదా అంటు చూడదు లోకం
గాయం చేసే వేళలో
కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు
నిజమే చెప్పేది ఏ భాషలో
సుడిగాలికి ఉడికిందే
దీపం ఈ దీపం చమురుండగ ఆరిందే
అలసటతో పాపం పాపం
వేల అక్షరాలు కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వార్ధం లేని రూపం అమ్మే కదా
_____________________
పాట పేరు: అమ్మే కదా ( Ammekaadha)
గాయకుడు: మంగ్లీ (Mangli)
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
సినిమా పేరు: రత్నం (Rathnam)
నటీనటులు – విశాల్ (Vishal), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar)
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం – హరి (Hari)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.